పంజాబ్ ఓపెనర్ల ఊచకోత‌.. రాజ‌స్థాన్ టార్గెట్ 224

షార్జా వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్2020-- 9వ మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 223 ప‌రుగుల చేసింది.

పంజాబ్ ఓపెనర్ల ఊచకోత‌.. రాజ‌స్థాన్ టార్గెట్ 224
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 27, 2020 | 9:29 PM

షార్జా వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్2020– 9వ మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 223 ప‌రుగుల చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. ముఖ్యంగా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ రాజస్థాన్ బౌలర్లనను ఊచకోత కోశారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. మ‌యాంక్ అగ‌ర్వాల్ (106 ప‌రుగులు, 10 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) ఐపీఎల్ లో మొదటి సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్ (69 ప‌రుగులు, 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) మరోసారి రాణించాడు. ఇక ఇన్నింగ్స్ చివ‌ర్లో మాక్స్‌వెల్ (13 ప‌రుగులు, 2 ఫోర్లు), నికోలాస్ పూర‌న్ (25 ప‌రుగులు, 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు)లు మెరుపులు  మెరిపించారు. ఈ క్ర‌మంలో పంజాబ్ జ‌ట్టు రాజ‌స్థాన్ ఎదుట భారీ 224 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది.

రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో రాజ్‌పూత్‌, టామ్ కుర్రాన్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది. మ్యాచ్‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాంటిగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. 183 ప‌రుగుల వ‌ర‌కు పంజాబ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. మ‌యాంక్ అగ‌ర్వాల్‌, కేఎల్ రాహుల్‌లు పంజాబ్‌కు భారీ స్కోర్ అందించారు. త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన బ్యాట్స్‌మెన్ కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ భారీ స్కోర్ చేసింది.