IPL 2020 : పోలార్డ్ ఖాతాలో అరుదైన రికార్డు
కరోనా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ యూఏఈలో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ పొట్టి క్రికెట్ సమరంలో బుధవారం ముంబై, కోల్‌కతా జట్లు తలపడగా.. ముంబై నెగ్గింది
కరోనా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ యూఏఈలో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ పొట్టి క్రికెట్ సమరంలో బుధవారం ముంబై, కోల్‌కతా జట్లు తలపడగా.. ముంబై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ముంబై ప్లేయర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒకే టీమ్ తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ టీ20 లీగ్ ప్రారంభమైన నాటి నుంచి పోలార్డ్ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ టీమ్ సాధించిన చాలా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చాలామంది జట్టులో ప్లేస్ కోసం ఆశగా చూసే ఐపీఎల్ లో ఒకే జట్టుకు సేవలు అందిస్తూ రాణించటంపై ముంబై కెప్టెన్ రోహిత్.. పోలార్డ్‌ను ప్రశసించాడు. 2013, 2019లో ఫైనల్ మ్యాచుల్లో ముంబై విజయం సాధించడానికి ప్రధాన కారణం పోలార్డ్ అని గుర్తు చేసుకున్నాడు. ఈ జట్టులోని మరో ప్లేయర్ హార్దిక్ పాండ్యా సైతం పోలార్డ్‌ను ప్రశంసించాడు. పోలార్డ్‌ను తన బ్రదర్ లాాంటా వాడని చెప్పుకొచ్చిన పాండ్య.. ముంబై తరఫున పోలార్డ్ 200 మ్యాచ్‌లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ టీ20 ఈవెంట్లో ఇప్పటి వరకూ 150 మ్యాచ్‌లు ఒకే టీమ్ తరఫున ఆడిన ఆటగాళ్లలో కీరన్ పోలార్డ్ టాప్-5లో ఉన్నాడు.
Also Read :
వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు, ఇకపై ‘హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ !