మరికాసేపట్లో చెన్నై, బెంగళూరు మధ్య కీలక పోరు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న ఐపీఎల్ టోర్నమెంట్‌పై ఆసక్తి పెరుగుతోంది. స్టేడియంలు సిక్సర్లు, ఫోర్లతో మోతెత్తిపోతున్నాయి.. టీ-20లలో పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యమే కనిపిస్తుంది కానీ ఈసారి బౌలర్లు కూడా చెలరేగిపోతుండటంతో కొత్త జోష్ వచ్చింది.. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ మరింత ఉత్తేజాన్ని ఉత్కంఠను కలిగించడం ఖాయం.. ఎందుకంటే తలపడుతున్నది చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాబట్టి! ఈ రెండూ ఫేవరెట్ జట్లే! బ్యాడ్‌లక్కేమిటంటే ఈ రెండూ టీములు ఈ సీజన్‌లో పెద్దగా పర్మాఫెన్స్ […]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న ఐపీఎల్ టోర్నమెంట్‌పై ఆసక్తి పెరుగుతోంది. స్టేడియంలు సిక్సర్లు, ఫోర్లతో మోతెత్తిపోతున్నాయి.. టీ-20లలో పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యమే కనిపిస్తుంది కానీ ఈసారి బౌలర్లు కూడా చెలరేగిపోతుండటంతో కొత్త జోష్ వచ్చింది.. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ మరింత ఉత్తేజాన్ని ఉత్కంఠను కలిగించడం ఖాయం.. ఎందుకంటే తలపడుతున్నది చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాబట్టి! ఈ రెండూ ఫేవరెట్ జట్లే! బ్యాడ్‌లక్కేమిటంటే ఈ రెండూ టీములు ఈ సీజన్‌లో పెద్దగా పర్మాఫెన్స్ చూపకపోవడం.. టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లోనే ముంబాయి ఇండియన్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత ఎందుకో తప్పటగులు వేసింది.. వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయం పాలై పలువురిని ఆశ్చర్యంలో ముంచేసింది.. అసలు ఇది ధోనీ సేననేనా అన్న అనుమానం కలిగింది.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై అభిమానులకు కాస్త ఆశలు రేకెత్తించింది.. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ పాత కథే పునరావృతమయ్యింది.. ఈ గెలుపోటముల సయ్యాటలేమిటో చెన్నై అభిమానులకు ఓ పట్టాన అర్థం కావడం లేదు.. పోనీ బెంగళూరు జట్టు ఏమైనా బాగుందా అంటే ఆ టీమ్‌దీ అదే కథ! అదే వ్యథ! మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్నట్టు కనిపించిన బెంగళూరు ఆ తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ఒక ముంబాయి, రాజస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌లో తఢాక చూపించి.. ఢిల్లీ చేతిలో మాత్రం ఓడిపోయింది.. బెంగళూరు టీమ్‌లో అరివీరభయంకర ఆటగాళ్లు ఉన్నారు.. అయినా ఈ ఓటములేమిటో తెలియడం లేదు.. ఓపెనర్లు పడిక్కల్, ఆరోన్ ఫించ్‌లు కనుక శుభారంభాన్ని ఇస్తే చెన్నై శ్రమించాల్సి ఉంటుంది.. ఇక కోహ్లీ, డివిలియర్స్ కూడా చెలరేగితే చెన్నైకు కష్టాలు తప్పవు.. బౌలింగ్‌లో యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు చక్కగా రాణిస్తున్నారు.. చెన్నై టీమ్‌లో బ్యాట్స్‌మెన్‌కు కొదవ లేదు.. ఓపెనర్ షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం చెన్నైకు శుభపరిణామం.. డుప్లెసిస్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు.. మిగిలినవారే అరకొర పరుగులనే చేస్తున్నారు . ధోనీ, కేదార్ జాదవ్, సామ్‌కరన్ బ్యాట్‌ల నుంచి ఇప్పటి వరకు పెద్దగా పరుగులు రాలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి.. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచ్‌లలో విజయం సాధించింది.. బెంగళూరు ఎనిమిదింట్లో గెలుపొందింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దయింది. మరికొద్ది గంటల్లో దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా మారింది..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లి (కెప్టెన్), మొహమ్మద్ సిరాజ్, షహబాజ్ అహ్మద్, పార్థివ్ పటేల్, యజువేంద్ర చహల్, నవదీప్ సైనీ, పవన్ నేగి, దేవ్‌దత్ పడిక్కల్, శివమ్ దూబే, ఉమేశ్ యాదవ్, గుర్‌కీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, పవన్ దేశ్‌పాండే (భారత ఆటగాళ్లు). క్రిస్ మోరిస్, జోష్ ఫిలిప్, మొయిన్ అలీ, ఆరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్, ఇసురు ఉదాన, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపా(విదేశీ ఆటగాళ్లు). చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మురళీ విజయ్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, పీయూష్ చావ్లా, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, శార్దుల్ ఠాకూర్, సాయికిషోర్, మోను కుమార్, కరణ్ శర్మ (భారత ఆటగాళ్లు). ఇమ్రాన్ తాహిర్, లుంగి ఇన్‌గిడి, షేన్ వాట్సన్, మిషెల్ సాన్‌ట్నర్, ఫాఫ్ డు ప్లెసిస్, డ్వేన్ బ్రేవో, జోష్ హాజల్‌వుడ్, స్యామ్ కరన్ (విదేశీ ఆటగాళ్లు).