AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీ రాకెట్ కేసు: ఆసుపత్రి యాజమాన్యానికి బిగుస్తున్న ఉచ్చు

విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కమిటీ చేతికి ప్రాథమిక ఆధారాలు లభించగా.. శ్రద్ధ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విచారణలో తొలిరోజు ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులో లేకపోగా.. […]

కిడ్నీ రాకెట్ కేసు: ఆసుపత్రి యాజమాన్యానికి బిగుస్తున్న ఉచ్చు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2019 | 11:56 AM

Share

విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కమిటీ చేతికి ప్రాథమిక ఆధారాలు లభించగా.. శ్రద్ధ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విచారణలో తొలిరోజు ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులో లేకపోగా.. వారి తీరుపై విచారణ బృందం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Follow Us