Hyderabad: మరోసారి హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌ మరోసారి ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌కు వేదిక కాబోతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని రేపటి నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కైట్‌ ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది. కైట్‌ ఫెస్టివల్‌తోపాటు స్వీట్ ఫెస్టివల్‌ కూడా నిర్వహిస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ. కైట్‌ అండ్‌ స్వీట్ ఫెస్టివల్‌ పోస్టర్స్‌ రిలీజ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్వీట్స్‌ నోరూరించాయి.

Hyderabad: మరోసారి హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌
Kite Festival
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 12, 2025 | 11:17 AM

అంత‌ర్జాతీయ వేడుక‌కు హైద‌రాబాద్ సిద్ధమ‌వుతోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ జరగబోతోంది. ఈ కైట్‌ ఫెస్టివల్‌లో 50 దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్లు, 14 రాష్ర్టాల నుంచి 60 దేశవాళీ కైట్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొనున్నారు. బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటు చేసిన కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ పోస్టర్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ పోస్టర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కార్యదర్శి స్మితాసబర్వాల్‌తోపాటు భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కైట్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో నగరవాసులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్‌తోపాటు.. గ్రామాల్లోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

ఇక.. సంక్రాంతి సందర్భంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో స్వీట్‌ ఫెస్టివ‌ల్ నిర్వహిస్తున్నామన్నారు ప‌ర్యాట‌క శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ స్మితా స‌బ‌ర్వాల్. ఈ హోమ్‌ మేడ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌లో దేశంలోని రాష్ట్రాలవారు పాల్గొంటున్నట్లు చెప్పారు.

స్వీట్‌ ఫెస్టివల్‌ సందర్భంగా నిర్వహించే స్వీట్ స్టాల్స్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు సంద‌ర్శించారు. వివిధ రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళ‌లు త‌మ ఇంట్లోనే త‌యారు చేసిన సాంప్రదాయ మిఠాయిలను రుచి చూశారు. అటు.. కైట్ ఫెస్టివల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు హ‌స్తక‌ళ‌లు, చేనేత వ‌స్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప‌ర్యాట‌క శాఖ అధికారులు తెలిపారు. కైట్‌ అండ్‌ స్వీట్ ఫెస్టివల్‌కు జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వహకులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..