AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్సైన ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు..!

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో జరిగిన గందరగోళం వివాదం మర్చిపోకముందే.. మరో వివాదం ఇంటర్ బోర్డును కుదిపేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులంతా ఇప్పటికే ప్రిపేర్ అయి పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఇలాంటి సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ఇంటర్ ప్రశ్నపత్రాలు అదృశ్యం కావడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్‌లో భద్ర పరిచిన ప్రశ్నాపత్రాల్లో రెండు బాక్సులు అదృశ్యమయ్యాయి. ఈ నెల […]

మిస్సైన ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2019 | 12:47 PM

Share

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో జరిగిన గందరగోళం వివాదం మర్చిపోకముందే.. మరో వివాదం ఇంటర్ బోర్డును కుదిపేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులంతా ఇప్పటికే ప్రిపేర్ అయి పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఇలాంటి సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ఇంటర్ ప్రశ్నపత్రాలు అదృశ్యం కావడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్‌లో భద్ర పరిచిన ప్రశ్నాపత్రాల్లో రెండు బాక్సులు అదృశ్యమయ్యాయి.

ఈ నెల 9, 10న జరగాల్సిన ప్రశ్నపత్రాలు అదృశ్యం కావడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో మొత్తం 13 బాక్సులు ఉంటే.. 11 బాక్సులే ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

కాగా.. ఈ విషయంపై విద్యార్థులు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న జరిగిన ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో 23 మంది విద్యార్థులు బలయ్యారని, ఇప్పటికైనా ఇంటర్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే