ఏపీలోని మోడల్ స్కూళ్లలో.. ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు!

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్ళు, కాలేజీలు ఇంకా ప్రారంభ కాలేదు. ఈ క్రమంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో

ఏపీలోని మోడల్ స్కూళ్లలో.. ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు!

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్ళు, కాలేజీలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగించింది. మామూలుగా నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు 2020 జూలై 31తో ముగియాలి. కానీ ఈ గడువును ఆగస్టు 25, 2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తిగల విద్యార్థులు ఆగస్ట్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కొత్త షెడ్యూల్ త్వరలో అందుబాటులోకి రానుంది. బాలికలకు 33.33 శాతం ప్రాధాన్యత ఇస్తారు. టెన్త్ పాసైన విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Read More:

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ

Click on your DTH Provider to Add TV9 Telugu