దృశ్యం సినిమా స్టైల్లో భార్య మర్డర్‌..ఊచలు లెక్కిస్తున్న భర్త, లవర్‌

సినిమాల్లో దోపిడీలు, హత్యల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులుంటాయి. ఎవరూ ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంటాయి. ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌..నిజ జీవితంలోనూ అలాగే జరుగుతున్నాయి. సినిమా ఫక్కీలో హత్యలు చేస్తున్నారు.  తాజాగా కేరళలో దృశ్యం సినిమాను తలపించేలా ఓ క్రైమ్‌ కథ వెలుగులోకొచ్చింది. భార్యను హత్య చేసి తెలివిగా తప్పించుకోవాలని చూసి చివరకు అడ్డంగా బుక్కయ్యారు ప్రేమ్‌, విద్య. ఇద్దరూ కలిసి ఉండేందుకు భర్తను నమ్మి వచ్చిన అభాగ్యురాలిని కడతేర్చారు. కొచ్చిలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నప్రేమ్‌, […]

దృశ్యం సినిమా స్టైల్లో భార్య మర్డర్‌..ఊచలు లెక్కిస్తున్న భర్త, లవర్‌
Pardhasaradhi Peri

|

Dec 11, 2019 | 6:00 PM

సినిమాల్లో దోపిడీలు, హత్యల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులుంటాయి. ఎవరూ ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంటాయి. ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌..నిజ జీవితంలోనూ అలాగే జరుగుతున్నాయి. సినిమా ఫక్కీలో హత్యలు చేస్తున్నారు.  తాజాగా కేరళలో దృశ్యం సినిమాను తలపించేలా ఓ క్రైమ్‌ కథ వెలుగులోకొచ్చింది. భార్యను హత్య చేసి తెలివిగా తప్పించుకోవాలని చూసి చివరకు అడ్డంగా బుక్కయ్యారు ప్రేమ్‌, విద్య. ఇద్దరూ కలిసి ఉండేందుకు భర్తను నమ్మి వచ్చిన అభాగ్యురాలిని కడతేర్చారు.

కొచ్చిలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నప్రేమ్‌, విద్య భార్యాభర్తలు. ఐతే ఇటీవలే 25 ఏళ్ల క్రితం తనతో స్కూల్లో కలిసి చదువుకున్నసునీత బేబి అనే చిన్ననాటి స్నేహితురాలిని..స్కూల్‌ రీ యూనియన్‌లో కలిశాడు ప్రేమ్‌. అప్పటివరకు వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇందుకు విద్య అడ్డుగా ఉందని భావించి ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశారు. సెప్టెంబర్‌ 21న తిరువనంతపురంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో ప్రేమ్‌, సునీత కలిసి విద్య గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఆమె డెడ్‌బాడీని తిరునల్వేలిలో పాతిపెట్టి ఏమీ తెలియనట్లుగా భార్య కనిపించడంలేదంటూ కేసు పెట్టాడు ప్రేమ్‌. ఆ తర్వాత ఆమె ఫోన్‌ను నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌లో పడేశారు.

ఇక ఆ తర్వాత ప్రియురాలితో కలిసి తిరునల్వేలిలో కాపురం పెట్టాడు. భర్త ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మంగుళూరులో సునీత ఫోన్‌ లొకేషన్‌ గుర్తించారు. మరోవైపు తమిళనాడు తిరునల్వేలి జిల్లా వల్లియూర్  పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ డెడ్‌బాడీ బయటపడటంతో అది విద్యదే అని నిర్థారించుకున్నారు. అక్కడి నుంచి విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రేమ్‌, విద్య మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని గుర్తించి..తమ స్టైల్లో భర్తను విచారించారు. దీంతో చివరకు నేరం అంగీకరించాడు ప్రేమ్‌. సునీతతో కలిసి ఉండేందుకే భార్యను హతమార్చినట్లు అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్ట్‌ చేసి చిప్పకూడు తినిపిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu