గుజరాత్ అల్లర్ల కేసు.. మోదీకి క్లీన్ చిట్.. తప్పంతా పోలీసులదే !
2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లపై విచారణ జరిపిన నానావతి కమిషన్.. నాటి ఆ రాష్ట్ర సీఎం, ప్రస్తుత పీఎం మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సంవత్సరంలో గుజరాత్ లో ఘర్షణలు జరిగినప్పుడు అల్లరి మూకలను పోలీసులు అదుపు చేయలేకపోయారని, తమ అసమర్థతను నిరూపించుకున్నారని ఈ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నివేదికను బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు. (అయితే అయిదేళ్ల క్రితమే ఈ రిపోర్టును […]

2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లపై విచారణ జరిపిన నానావతి కమిషన్.. నాటి ఆ రాష్ట్ర సీఎం, ప్రస్తుత పీఎం మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సంవత్సరంలో గుజరాత్ లో ఘర్షణలు జరిగినప్పుడు అల్లరి మూకలను పోలీసులు అదుపు చేయలేకపోయారని, తమ అసమర్థతను నిరూపించుకున్నారని ఈ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నివేదికను బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు. (అయితే అయిదేళ్ల క్రితమే ఈ రిపోర్టును కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది). ఆ ఏడాది మూడు రోజులపాటు జరిగిన దాడులను అప్పటి ఏ మంత్రిగానీ, మరెవరు గానీ ప్రోత్సహించారనడానికి ఆధారాలు లేవని నానావతి కమిషన్ తన 1500 పేజీల నివేదికలో స్పష్టం చేసింది.
ఆ నాడు పోలీసుల వద్ద తగినన్ని ఆయుధాలు లేకపోవడంవల్లో, అసమర్థత కారణంగానో పలు చోట్ల జరిగిన అల్లర్లను అదుపు చేయలేక చేతులెత్తేశారని ఈ కమిషన్ వెల్లడించింది. 2002 లో జరిగిన అల్లర్లలో దాదాపు వెయ్యిమంది మరణించారు. వీరిలో చాలామంది ముస్లిములు..గుజరాత్ అల్లర్లపై మాజీ న్యాయమూర్తులు జి.టి. నానావతి, అక్షయ్ మెహతా తమ తుది నివేదికను 2014 లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. నాడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై విచారణ జరగాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ నివేదిక సిఫారసు చేసింది.
2002 ఫిబ్రవరి 27 న అయోధ్య నుంచి గోద్రాకు 58 మంది హిందూ కరసేవకులతో వస్తున్న రైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ ఘటనలో కరసేవకులు మంటలకు ఆహుతయ్యారు. దీంతో ప్రతీకారంగా ఆ రాష్ట్రంలో అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. 223 మంది గల్లంతు కాగా… రెండున్నర వేలమంది గాయపడ్డారు.



