AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌కు గర్వం..స్పీకర్‌కు పద్దతి లేదు.. బాబు ఆగ్రహం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గర్వం పెచ్చరిల్లిందని వ్యాఖ్యానించారు టిడిపి అధినేత చంద్రబాబు. 151 మంది ఎమ్మెల్యేలున్నారన్న గర్వంతో ముఖ్యమంత్రి మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా పద్దతి లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం ఏపీ అసెంబ్లీలో పలు సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రతి రోజు ఆందోళనలు […]

జగన్‌కు గర్వం..స్పీకర్‌కు పద్దతి లేదు.. బాబు ఆగ్రహం
Rajesh Sharma
|

Updated on: Dec 11, 2019 | 6:30 PM

Share

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గర్వం పెచ్చరిల్లిందని వ్యాఖ్యానించారు టిడిపి అధినేత చంద్రబాబు. 151 మంది ఎమ్మెల్యేలున్నారన్న గర్వంతో ముఖ్యమంత్రి మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా పద్దతి లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారాయన.

బుధవారం ఏపీ అసెంబ్లీలో పలు సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రతి రోజు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వాపోయారు. ఉల్లి కొరత తీవ్రమవడంతో ఉల్లిపాయల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

అసలే ప్రజలు ఇబ్బందుల్లో వుంటే ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని టిడిపి అధినేత అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు దారుణమని వ్యాఖ్యానించారు. తనకు 151 ఎమ్మెల్యేల బలం వుందన్న గర్వంతో ,అహంభావంతో జగన్ రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా పద్దతి లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. తమకు మైక్ ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతో మైక్ కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని చంద్రబాబు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసింది తామేనని చెప్పుకున్న బాబు, వైసీపీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారని ఆరోపించారు. 4లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వటానికి 20లక్షల మంది పొట్టకొడతారా అని ప్రశ్నించారు బాబు. వంశీకి స్పీకర్ ప్రత్యేక స్థానం కల్పించటాన్ని తప్పుబట్టిన చంద్రబాబు, వంశీ పార్టీ సస్పెన్షన్ లో ఉండగా ప్రత్యేకంగా సీటు ఇవ్వకూడదని చంద్రబాబు వాదిస్తున్నారు. వంశీపై పూర్తి బహిష్కరణ వేటు పడితే తప్ప అతను ప్రత్యేక సభ్యుడు కాలేడని, ఒకవేల బహిష్కరణ వేటు పడినా కూడా ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడని చంద్రబాబు వివరించారు.