AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజపతుల కోట టీడీపీలో ముసలం.. రాజావారికి చెక్ పెడుతున్న పార్టీ నేతలు.. అధిష్టానం అండపై అనుమానాలు

తెలుగు దేశం పార్టీలో ఒకప్పుడు నెంబర్ 2గా వెలిగిన విజయనగరం రాజావారికి పార్టీ అధిష్టానం సహకరించడం లేదన్న కథనాలు ఉత్తరాంధ్రలో కలకలం రేపుతున్నాయి. విజయనగరంలో జిల్లా పాలిటిక్స్‌తో పాటు...

గజపతుల కోట టీడీపీలో ముసలం.. రాజావారికి చెక్ పెడుతున్న పార్టీ నేతలు.. అధిష్టానం అండపై అనుమానాలు
Rajesh Sharma
|

Updated on: Dec 13, 2020 | 3:45 PM

Share

Infight in Vijayanagaram TD Party: తెలుగు దేశం పార్టీలో ఒకప్పుడు నెంబర్ 2గా వెలిగిన విజయనగరం రాజావారికి పార్టీ అధిష్టానం సహకరించడం లేదన్న కథనాలు ఉత్తరాంధ్రలో కలకలం రేపుతున్నాయి. విజయనగరంలో జిల్లా పాలిటిక్స్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన ఘనత కలిగిన అశోక గజపతి రాజుకు ఇప్పుడు జిల్లా స్థాయి నేతలే ఎదురు తిరుగుతుండడం చర్చనీయాంశమైంది. విజయనగరంలో టీడీపీకి పెద్ద దిక్కుగా వున్న అశోక గజపతి క్రమంగా ఆ స్థాయిని కోల్పోతున్నారా అన్న సందేహాలను టీడీపీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అందుకు తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

అశోక గజపతి రాజు అంటే తెలుగు రాజకీయాల్లో తెలియని వారుండరు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సమకాలీకులు. అశోక్ గజపతి రాజు 1978 లో మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టగా అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రబాబు, వైఎస్సార్ కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గజపతి రాజుల వారసుడైన అశోక్ గజపతి రాజు సుమారు నాలుగు దశాబ్దాలుగా మచ్చ లేని నేతగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1978 నుండి ఇప్పటివరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగానే కాకుండా రాష్ట్ర, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. టీడీపీ సంక్షోభాల్లో సైతం చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉన్నారు.

ALSO READ: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న అభిప్రాయ సేకరణ.. గ్రూపులుగా మారిన టీపీసీసీ రేసు గుర్రాలు

అంతటి ఇమేజ్ ఉన్న అశోక గజపతిని ఇప్పుడు పార్టీ ప్రక్కన పెడుతుందన్న కామెంట్లు తాజాగా జోరందుకున్నాయి. గత కొన్నాళ్లుగా పార్టీ అధిష్ఠానం అశోక్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విజయనగరం జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలేనని కార్యకర్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గత వారం విజయనగరం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

సుమారు నలభై ఏళ్లకు పైగా అశోక గజపతి నివాసమే టీడీపీ కార్యాలయంగా వెలుగొందింది. ఇప్పటికి చాలా మంది అశోక్ బంగ్లానే టీడీపీ కార్యాలయంగా భావిస్తారు. అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నూతన టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి కొందరు టీడీపీ నేతలు హాజరయ్యారు. అదే సమయంలో మరికొందరు అశోక్ గజపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అశోక్, మీసాల గీత ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు సైతం చేసుకున్నారు. వీరి మాటల యుద్ధం జిల్లా టీడీపీ నేతల్లో అయోమయాన్ని, ఆశ్చర్యాన్ని కలుగ జేసింది. ప్రస్తుతం జరిగిన పరిణామాలు జిల్లా టీడీపీలో ఒకరకమైన అనిశ్చితికి తెరలేపాయి.

ALSO READ: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న అభిప్రాయ సేకరణ.. గ్రూపులుగా మారిన టీపీసీసీ రేసు గుర్రాలు

అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. గీత అశోక్‌పై విమర్శలు చేయటం వెనుక పార్టీ పెద్దల హస్తం ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగేలా చూడాలని క్యాడర్ కోరుకుంటుంది. లేకపోతే పార్టీ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం వుందని చెప్పుకుంటున్నారు. అసలే ట్రస్టు వ్యవహారంలో పదునైన ఆరోపణలతో ఇబ్బందినెదుర్కొంటున్న అశోక్ గజపతి రాజు.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా వున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే.. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ALSO READ: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న అభిప్రాయ సేకరణ.. గ్రూపులుగా మారిన టీపీసీసీ రేసు గుర్రాలు