ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

ఓ బస్సు ప్రమాదం 26 మందిని బలి తీసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొందరు తీవ్రంగా గాయపడి ..

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 11, 2021 | 9:56 AM

ఓ బస్సు ప్రమాదం 26 మందిని బలి తీసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాలో బుధవారం అర్ధరాత్రి పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో 26 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను జావా ప్రావిన్స్‌ పట్టణం సుబాంగ్‌ నుంచి ఆసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే బస్సు వెళ్తుండగా డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో లోయలోకి దూసుకెళ్లినట్లు తెలిపారు. బస్సు సుమారు 65 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బ్రేకులు సరిగ్గా పని చేయకపోవడంతో బస్సు లోయలో పడినట్లు క్షతగాత్రులు అధికారులకు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఘటన స్థలంలో 26 మృతదేహాలను వెలికి తీశాం..

కాగా, ప్రమాదం స్థలం నుంచి 26 మృతదేహాలను వెలికి తీసినట్లు బాండుంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్‌ దేడెన్‌ రిద్వాన్సా తెలిపారు. అలాగే 35 మంది గాయపడినట్లు తెలిపారు. వారిని అంబులెన్స్‌లో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల్లో వాహనం డ్రైవర్‌ కూడా ఉన్నారు. ఇండోనేషియాలో గతంలో జరిగిన పలు ప్రమాదాల్లో అధిక సంఖ్యలో మరణించారు. 2019 డిసెంబర్‌లో సమత్రా దీవుల్లో బస్సు నదిలో పడిన ఘటనలో 35 మంది వరకు మరణించగా, 2018లో పశ్చిమ జవాలోని కొండ ప్రాంతంలో పర్యాటక బస్సు లోబ్తా పడిన ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి చదవండి :

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు – కారు ఢీ.. 8 మంది దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు

నిజామాబాద్‌లో దొంగతనానికి పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌పై న్యాయస్థానం సంచలన తీర్పు.. ముఠా సభ్యులకు ఏడేళ్ల జైలు శిక్ష

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!