ఆగని పరుగు…. 154 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్… 13,550 పైన నిఫ్టీ ముగింపు
భారత స్టాక్‌మార్కెట్లు డిసెంబర్ 14న కొత్త రికార్డులు నెలకొల్పాయి. ఇంధన, మౌలిక, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించడంతో పాటు రూపాయి బలపడడం, విదేశీ పెట్టుబడుల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.
భారత స్టాక్‌మార్కెట్లు డిసెంబర్ 14న కొత్త రికార్డులు నెలకొల్పాయి. ఇంధన, మౌలిక, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించడంతో పాటు రూపాయి బలపడడం, విదేశీ పెట్టుబడుల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 154 పాయింట్ల లాభంతో 46,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 13,558 వద్ద ముగిసింది. ఈ స్థాయికి సూచీలు చేరడం మార్కెట్ చరిత్రలో గరిష్ట రికార్డు. మరోవైపు ఆటో, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి.
సెన్సెక్స్ నిన్న 46,373 వద్ద గరిష్టాన్ని తాకింది. కాగా 45,951 వద్ద కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీ సైతం 13,597–13,472 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో సోమవారం ఎఫ్‌ఐఐలు రూ.2,264 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఫండ్స్ (డీఐఐ) రూ.1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీశారు. ఇక డాలర్ మారకంలో రూపాయి 9 పైసలు బలపడి 73.55 వద్ద స్థిరపడింది. అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతులు లభించడంతో పాటు బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్‌పై బ్రిటన్–ఈయూల మద్య జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో సాను కూల సంకేతాలు నెలకొన్నాయి.