AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య.. అండగా నిలిచిన ప్రభుత్వం..!

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి కన్నవారి కష్టాలను తీర్చాలనుకున్న ఒక యువకుడి కలలు అర్థాంతరంగా ముగిశాయి. కర్నూలు నగరం గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నకొడుకు ఉన్నత స్థితిలో తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులకు, చందు విగతజీవిగా వస్తున్నాడనే వార్త తీరని వేదనను మిగిల్చింది.

ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య.. అండగా నిలిచిన ప్రభుత్వం..!
Indian Student Suicide Usa
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 02, 2026 | 5:11 PM

Share

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ఉద్యోగం రాలేదని, ఇక రాబోదని మనస్థాపం చెంది కర్నూలు యువకుడు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కర్నూలు నగరంలోని గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు 26.. అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన చందు.. బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కర్నూలు నగరం బళ్లారి చౌరస్తా సమీపంలో గీతా నగర్ కాలనీలో సెక్యూరిటీ పనిచేసే కేశవ యాదవ్ విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో సంతానం చందు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే చందును ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు పంపించారు. చికాగోలోని డిపాల్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ పూర్తి చేసిన చందు.. అక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. అమెరికాలో మారిన పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తనకు ఉద్యోగం రాదన్న ఆందోళనతో తీవ్ర మానసిక వేదన కు గురయ్యారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 28న తాను ఉండే అపార్ట్మెంట్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

చందు మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు తానా టీం స్క్వేర్ కో చైర్మన్ చిరంజీవి గల్ల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అక్కడి భారత సమూహం ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేపట్టారు. రెండు రోజులలో సుమారు 76 వేల డాలర్లు వచ్చాయి. మృత దేహాన్ని కర్నూలు కు పంపించడానికి సుమారు 25వేల డాలర్లు ఖర్చవుతుంది .మిగిలిన డబ్బులు కుటుంబానికి ఆర్థిక సహాయం కింద అందజేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

చందు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం కోరుతూ సోషల్ మీడియాలో యూజర్ ఒకరు మంత్రి లోకేష్ కు లేఖ రాశారు. తక్షణమే స్పందించిన మంత్రి చందు కుటుంబ సభ్యులతో మాట్లాడారు మృతదేహాన్ని ఇండియాకు తెర్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు చందు సోదరుడు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చందు మృతదేహాన్ని భారత్కు తెప్పించడంతోపాటు కర్నూలుకు తరలించేలా చూడాలని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడును మంత్రి లోకేష్ కోరారు. ఈ కష్టకాలంలో చందు కుటుంబానికి అండగా నిలబడటానికి తమ వంతు కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరి చందు మృతదేహం వస్తుందా లేదా వస్తే ఎప్పటికీ వస్తుంది అనేది తేలాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి…

Follow Us
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??