AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: జీవితం ఓ నీటి బుడగ అంటే ఇదేనమో.. చెల్లి పెళ్లి వేళ సంతోషంగా డ్యాన్స్ చేస్తుండగా..

నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో చెల్లి పెళ్లి వేడుకలో ప్రదీప్ అనే యువకుడు డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. అన్నవరంలోని "అన్నయ్యా అన్నావంటే" పాటకు నృత్యం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా ఉన్న పెళ్లి ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Andhra: జీవితం ఓ నీటి బుడగ అంటే ఇదేనమో.. చెల్లి పెళ్లి వేళ సంతోషంగా డ్యాన్స్ చేస్తుండగా..
Dance
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 02, 2026 | 4:08 PM

Share

చెల్లి పెళ్లి.. అంటే అన్నయ్య ఆనందమే వేరు.. సంతోషం రెట్టింపవుతుంది.. తోడపుట్టిన చెల్లెల్ని.. ఇష్టమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి.. అత్తగారింటికి ఆనందంగా పంపాలి అనుకున్నాడు.. అలానే.. చెల్లిలి పెళ్లిని ఘనంగా జరిపించాడు.. అంతటా.. కోలాహలం.. చెల్లెలు సంతోషంగా అత్తగారింటికి అడుగుపెట్టే వేళ.. అందరితో కలిసి డ్యాన్స్ చేశాడు.. అలా ఆనందం.. ఒక్కసారిగా విషాదంగా మారింది. పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ.. వధువు అన్న మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో చోటుచేసుకుంది.. చెల్లి పెళ్లి వేడుక అంటే ఏ అన్నకైనా జీవితంలో ప్రత్యేకమైన క్షణం. అలాంటి ఆనంద సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నృత్యం చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్న ప్రదీప్ అనే యువకుడు.. అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందడం హృదయ విదారకంగా మారింది. ప్రదీప్ హార్ట్ ఎటాక్ తో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు.. పవన్ కల్యాణ్ నటించిన అన్నవరం సినిమాలోని అన్నయ్యా.. అన్నావంటే.. అనే పాటకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు..

దీంతో పెళ్లి సంబరాలతో కళకళలాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. కాసేపటి క్రితం నవ్వులు, పాటలతో మార్మోగిన ఆ వేదికపై కన్నీటి వర్షం కురిసింది. చెల్లి పెళ్లిలో అన్న తన చేతులతో ఆశీర్వదించాల్సిన వేళ, అతని మృతదేహం ముందు కుటుంబ సభ్యులు విలపించడం చూసి గ్రామస్తులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.

వీడియో చూడండి..

ప్రదీప్ ఆ కుటుంబానికి అతడు ప్రధాన ఆధారం అని స్థానికులు చెబుతున్నారు. ఎంతో ప్రేమగా చెల్లి పెళ్లిని జరిపించాలనే కలతో ఉన్న అతను, అదే వేడుకలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. పెళ్లి కూతురు అయిన చెల్లి పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. ఒక వైపు కొత్త జీవితం ప్రారంభమవుతుండగా, మరో వైపు అన్నను కోల్పోయిన బాధతో ఆమె తీవ్ర వేదనలో మునిగిపోయింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ జీవితం ఎంత అనిశ్చితమో మరోసారి గుర్తు చేసింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా ప్రారంభమైన పెళ్లి వేడుక, కన్నీటి కథగా మారిపోవడం అందరినీ కలచివేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us