AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రమైన ఎండల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని పేర్కొంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా.. ఉష్ణోగ్రతలు మాత్రం అలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Weather Report
Shaik Madar Saheb
|

Updated on: May 02, 2026 | 3:35 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఓ వైపు వేడి.. మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తీవ్రమైన ఎండల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర-దక్షిణ ద్రోణి,/ గాలులు అంతరాయం, పశ్చిమ రాజస్థాన్‌ పై గల ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్నది. నిన్నటి దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి/గాలి అంతరాయం ఇప్పుడు బలహీనపడింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – ఈదురు గాలులు గంటకు 50 – 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక :- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర దక్షిణ ద్రోణి ఒకటి పశ్చిమ రాజస్థాన్ దాన్ని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి తూర్పు రాజస్థాన్ మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. నిన్న దక్షిణ ఒడిస్సా నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ద్రోణి/వాయు అస్థిరత ఈరోజు బలహీన పడింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి నాలుగు రోజుల్లో క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

శనివారం, ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Follow Us
మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు వర్షాలు..
ఈ రాశులకు 50 రోజుల పండుగ! ఐశ్వర్యవంతులు కావడం పక్కా..
ఈ రాశులకు 50 రోజుల పండుగ! ఐశ్వర్యవంతులు కావడం పక్కా..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..