AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. తొలిసారి 49,000 మార్క్‌‌ను తాకిన సెన్సెక్స్

భారీ లభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభిమయ్యాయి. సెన్సెక్స్ తొలిసారి 49,000 మార్క్‌ను తాకింది. నిఫ్టీ సైతం అదే జోరును కొనసాగిస్తోంది. సోమవారం..

Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. తొలిసారి 49,000 మార్క్‌‌ను తాకిన సెన్సెక్స్
Sanjay Kasula
|

Updated on: Jan 11, 2021 | 10:32 AM

Share

Sensex-Nifty Trade Near Record Highs : భారీ లభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభిమయ్యాయి. సెన్సెక్స్ తొలిసారి 49,000 మార్క్‌ను తాకింది. నిఫ్టీ సైతం అదే జోరును కొనసాగిస్తోంది. సోమవారం (11 జనవరి,2021) ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 391 పాయింట్లు లాభపడి 49,177 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 108 పాయింట్ల ఎగబాకి 14,456 వద్ద ట్రేడవుతోంది.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.24 వద్ద కొనసాగుతోంది. టెక్‌ కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుంటోందన్న సంకేతాలు, టీకా పంపిణీ, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును మరింత పెంచాయి.

ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటా మోటార్స్‌, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు..‌ ఆధార్​ చెల్లుబాటుపై ఇవాళ తీర్పు

జాతివివక్ష వ్యాఖ్యలపై బీసీసీఐ సీరియస్.. కామెంట్స్ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్..

రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ.. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అన్నదాతలు

ఆరు వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన టీమిండియా నయావాల్‌.. 11వ భారత క్రికెటర్‌గా సరికొత్త రికార్డు