జాతివివక్ష వ్యాఖ్యలపై బీసీసీఐ సీరియస్.. కామెంట్స్ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్..

సిడ్నీ టెస్ట్‌లో జాతివివక్ష వ్యాఖ్యలను బీసీసీఐ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఛైర్మన్‌తో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడారు. కొందరు ఆస్ట్రేలియా అభిమానులు..

జాతివివక్ష వ్యాఖ్యలపై బీసీసీఐ సీరియస్.. కామెంట్స్ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్..
Follow us

|

Updated on: Jan 11, 2021 | 7:56 AM

సిడ్నీ టెస్ట్‌లో జాతివివక్ష వ్యాఖ్యలను బీసీసీఐ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఛైర్మన్‌తో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడారు. కొందరు ఆస్ట్రేలియా అభిమానులు భారత ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలను సీఏ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని జైషా కోరారు. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఛైర్మన్‌ నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌ ఆతిథ్య ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా మూడో టెస్టు ఆడుతోంది. అయితే ఆట నాలుగో రోజు భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో మరోసారి ఆస్ట్రేలియా అభిమానులు కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని కెప్టెన్‌ రహానెకు తెలియజేయడంతో అతను అంఫైర్లకు ఫిర్యాదు చేశాడు.

దీంతో మ్యాచ్‌లో  కాసేపు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది, పోలీసులు జాతి వివక్ష కామెంట్ చేసిన ఆరుగురిని స్టేడియం బయటికి పంపించారు. శనివారం సైతం ఇదే రీతిలో సిరాజ్‌, బుమ్రాపై ఓ ఆస్ట్రేలియా ప్రేక్షకుడు జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది.

దీంతో బీసీసీఐ కార్యదర్శి సీరియస్‌గా తీసుకున్నారు. భారత్ ఫిర్యాదుపై ఐసీసీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ పేర్కొంది. అంతేకాకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియాను వివరణ అడిగింది. కాగా ఈ అవాంఛనీయ సంఘటనలపై సీఏ క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఎవరైతే ఇలాంటి కామెంట్స్ చేశారో వారిని అరెస్ట్ చేయాలంటూ బీసీసీఐ కార్యదర్శి జైషా ఆస్ట్రేలియా బోర్డును కోరారు.

ఇవి కూడా చదవండి :

సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు..‌ ఆధార్​ చెల్లుబాటుపై ఇవాళ తీర్పు

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.