AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా? ఆశ్చర్యపోయే నిజాలు

భారత రైల్వేలో లోకో పైలట్ల జీతాలు వారి అనుభవం, బాధ్యతలను బట్టి మారుతుంటాయి. అసిస్టెంట్ లోకో పైలట్‌లు రూ.25,000-35,000 సంపాదిస్తే, రాజధాని, శతాబ్ది డ్రైవర్లు రూ.35,000-55,000 అందుకుంటారు. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లను నడిపే వారికి అత్యధికంగా రూ.70,000 నుండి రూ.1.1 లక్ష వరకు జీతం లభిస్తుంది.

సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా? ఆశ్చర్యపోయే నిజాలు
Indian Railway Loco Pilot
SN Pasha
|

Updated on: Apr 24, 2026 | 9:38 PM

Share

భారతదేశంలో ప్రజల రవాణా వ్యవస్థలో రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. సామాన్యుల నుంచి ధనికుల వరకు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో రైళ్లు ప్రధాన సాధనం. ఈ భారీ వ్యవస్థను సజావుగా నడిపించడంలో లోకో పైలట్ల (రైలు డ్రైవర్లు) పాత్ర అత్యంత కీలకం. అయితే ఈ బాధ్యతాయుతమైన ఉద్యోగానికి వారికి ఎంత జీతం లభిస్తుందనే విషయం చాలామందికి ఆసక్తికరమే. రైల్వేలో డ్రైవర్ కెరీర్ సాధారణంగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ప్రారంభమవుతుంది. ప్రారంభ బేసిక్ జీతం సుమారు రూ.19,900 ఉంటుంది. వివిధ అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఆదాయం పొందుతారు. అనుభవం పెరుగుతూ, ప్రమోషన్లు పొందిన కొద్దీ సీనియర్ లోకో పైలట్, చీఫ్ లోకో పైలట్ స్థాయిలకు చేరుకుని జీతం కూడా గణనీయంగా పెరుగుతుంది.

అత్యంత ప్రాధాన్యత గల రైళ్లైన రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను నడిపే లోకో పైలట్లకు అధిక అనుభవం అవసరం. వీరికి అదనపు అలవెన్సులు, దూరాన్ని బట్టి చెల్లింపులు కూడా లభిస్తాయి. సాధారణంగా వీరి నెల జీతం రూ.35,000 నుంచి రూ.55,000 మధ్య ఉంటుంది. సీనియారిటీ ఆధారంగా ఈ మొత్తం మారుతుంది. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన ఆధునిక రైళ్లలో వందే భారత్ ప్రత్యేక స్థానం సంపాదించింది. అధునాతన సాంకేతికతతో అధిక వేగంతో నడిచే ఈ రైళ్లను నడిపే లోకో పైలట్లకు ఎక్కువ అనుభవం, నైపుణ్యం అవసరం.

అందుకే వీరి జీతం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ వందే భారత్ రైళ్ల డ్రైవర్లు నెలకు రూ.70,000 నుంచి రూ.1.1 లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది. మొత్తానికి రైల్వే డ్రైవర్లలో అత్యధికంగా సంపాదించేవారు వందే భారత్ లోకో పైలట్లే. ఆ తరువాత రాజధాని, శతాబ్ది డ్రైవర్లు ఉంటారు. అనుభవం, రూట్లు, బాధ్యతల ఆధారంగా జీతాల్లో తేడాలు కనిపిస్తాయి. భారీ బాధ్యతల మధ్య ఈ ఉద్యోగం గౌరవప్రదమైనదిగా కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!