IND Vs SA: సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…

India Vs South Africa Series: టీమిండియాకు న్యూజిలాండ్ సిరీస్ ఓ పీడకల అని చెప్పాలి. బలహీనతలను బహిర్గతం చేస్తూ మరోసారి కోహ్లీసేనను ఓ సాధారణ జట్టుగా మార్చేసింది. అయితే ఆ సిరీస్‌ను త్వరగా మర్చిపోయి మరో సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో సఫారీలతో మూడు వన్డేల సిరీస్ ఇవాళ్టి నుంచి ఆరంభం కానుంది. ఒక పక్క కరోనా మహమ్మారి.. మరో పక్క వరుణుడు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ఈ పోరుకు ధర్మశాల వేదికగా సిద్ధమైంది. ఆల్‌రౌండర్ హార్దిక్ […]

IND Vs SA: సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం...
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 12, 2020 | 1:56 PM

India Vs South Africa Series: టీమిండియాకు న్యూజిలాండ్ సిరీస్ ఓ పీడకల అని చెప్పాలి. బలహీనతలను బహిర్గతం చేస్తూ మరోసారి కోహ్లీసేనను ఓ సాధారణ జట్టుగా మార్చేసింది. అయితే ఆ సిరీస్‌ను త్వరగా మర్చిపోయి మరో సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో సఫారీలతో మూడు వన్డేల సిరీస్ ఇవాళ్టి నుంచి ఆరంభం కానుంది. ఒక పక్క కరోనా మహమ్మారి.. మరో పక్క వరుణుడు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ఈ పోరుకు ధర్మశాల వేదికగా సిద్ధమైంది.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి పునరాగమనం చేయడంతో టీమిండియాకు సరికొత్త జోష్ వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నా.. సఫారీలను తక్కువ అంచనా వేయలేం. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టును స్వదేశంలో వైట్‌వాష్ చేసి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలు భారత్‌లో అడుగుపెట్టారు.

కాగా, ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు పాండ్య, ధావన్, భువనేశ్వర్‌లపైనే ఉంటాయని చెప్పాలి. గాయాలు కారణంగా ఈ ముగ్గురూ కొద్దిరోజుల పాటు ఆటకు దూరం అయ్యారు. దీనితో ఈ సిరీస్‌లో వీరి ఆటతీరుపై టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా, ఈ సిరీస్ వారికి అగ్నిపరీక్షేనని చెప్పవచ్చు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో సరికొత్త ఓపెనింగ్ కోహ్లీసేనకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.?

భారత్‌(అంచనా): ధావన్‌, పృథ్వీ షా, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా, భువనేశ్వర్‌, నవ్‌దీప్‌ సైని, చాహల్‌, బుమ్రా దక్షిణాఫ్రికా(అంచనా): డికాక్‌, స్ముట్స్‌, డసెస్‌, డుప్లెసిస్‌, క్లాసెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, కేశవ్‌ మహారాజ్‌, హెండ్రిక్స్‌, నోర్జె, ఎంగిడి

For More News:

ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…

కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..

కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..

‘వకీల్ సాబ్’లో గోవా బ్యూటీ..?

పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…

మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?

ఐపీఎల్ 2020 తాత్కాలికంగా రద్దు..?

రూ.60 లక్షల లాటరీ గెలిచాడు.. అంతలోనే షాక్ తగిలింది..