వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైసీపీ నేడు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుధీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ..

వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2020 | 8:08 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో పదో వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో.. పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరిపేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు వైసీపీ కార్యకర్తలు. 2011 మార్చి 12న జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీ పుట్టింది. వైఎస్సార్సీపీ అంటే ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’.

ఈ సందర్భంగా సీఎం భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైసీపీ నేడు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుధీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు జగన్.

కాగా.. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా.. రెండుసార్లు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే.. అనుకోని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. వైఎస్ మరణం తరువాత పేరు కలిసి వచ్చేలా.. శివ కుమార్ అనే వ్యక్తి.. ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో’ రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీలో చేరిన జగన్.. దానికి తానే అధినేత అయ్యారు. తండ్రి పేరు కలిసి వచ్చేలా ఉండటమే అందుకు కారణం.

ఆపై 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనా సరే.. లెక్కచేయకుండా.. దాదాపు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకమయ్యారు. ఓ సందర్భంలో జగన్ జైలుకెళ్లడంతో.. పార్టీ అయోమయంలో పడింది. దీంతో.. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సహకారంతో పార్టీని నడిపించారు. ఇక భార్య భారతి అన్ని వ్యాపారాలను చూసుకుంటూ వచ్చారు. అలా.. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ.. ఆపై తన ఆశయాన్ని సాధించుకున్నారు జగన్.

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు