IPL 2020: ఐపీఎల్ 2020 తాత్కాలికంగా రద్దు..?

IPL 2020: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 4000 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందగా.. లక్షల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 62 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ నెల 29 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 13వ సీజన్‌పై అనుమానాలు మొదలయ్యాయి. పలువురు ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అవుతుందని చెబుతుంటే.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం […]

IPL 2020: ఐపీఎల్ 2020 తాత్కాలికంగా రద్దు..?
Follow us

|

Updated on: Mar 12, 2020 | 1:57 PM

IPL 2020: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 4000 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందగా.. లక్షల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 62 కేసులు నమోదయ్యాయి.

ఇలాంటి తరుణంలో ఈ నెల 29 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 13వ సీజన్‌పై అనుమానాలు మొదలయ్యాయి. పలువురు ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అవుతుందని చెబుతుంటే.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కరోనా దృష్ట్యా తీసుకున్న నిర్ణయంతో దాదాపు టోర్నమెంట్ జరగదని స్పష్టమవుతోంది.

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని విదేశీయుల వీసాలను ఏప్రిల్ 15 వరకు కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో టోర్నీకి విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్చి 14న సమావేశం కానుంది. టీ20 మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఆ సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  అటు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించలేమని ఇప్పటికే చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి.

ఐపీఎల్‌ను రద్దు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా టిక్కెట్ల అమ్మకాలను కూడా నిషేదించాయి. ఈ తరుణంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐపీఎల్ ఈ ఏడాది తాత్కాలికంగా రద్దయినట్లేనని.. ఇదే విషయాన్ని గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి కరోనా ఎఫెక్ట్‌తో బీసీసీఐ వెనక్కి తగ్గుతుందో లేదో.?

For More News:

ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…

కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..

కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..

సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…

‘వకీల్ సాబ్’లో గోవా బ్యూటీ..?

పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…

మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?

రూ.60 లక్షల లాటరీ గెలిచాడు.. అంతలోనే షాక్ తగిలింది..