India Vs Australia 2020: భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. టీమిండియాలో ఎంత మంది ప్లేయర్స్‌కు గాయలయ్యాయంటే.!

India Vs Australia 2020: ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో రెండు జట్లను ఆటగాళ్ల గాయాల బెడద వేధిస్తోంది. మొన్నటివరకు...

India Vs Australia 2020: భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. టీమిండియాలో ఎంత మంది ప్లేయర్స్‌కు గాయలయ్యాయంటే.!

Updated on: Jan 10, 2021 | 9:13 PM

India Vs Australia 2020: ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో రెండు జట్లను ఆటగాళ్ల గాయాల బెడద వేధిస్తోంది. మొన్నటివరకు ఆసీస్ జట్టుకు ఈ సమస్య ఉండగా.. ఇప్పుడు ఇండియా వంతు వచ్చింది. టీమిండియాలోని చాలామంది స్టార్ ప్లేయర్స్ గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌లో పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు.

గాయంతో వన్డేలు, టీ20లు, మొదటి రెండు టెస్టులకు రోహిత్ శర్మ దూరం కాగా.. బౌలర్ ఇషాంత్ శర్మ మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. ఇక పితృత్వ సెలవులపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఇండియా వచ్చేయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలు కారణంగా ఇంటిదారి పట్టారు. కాగా, వికెట్ కీపర్‌ పంత్‌కు కూడా గాయం అయినప్పటికీ.. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.