AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా తండ్రి ఎవరో, ఎలా ఉంటారో నాకు తెలియదు.. ఎమోషనలైన టాలీవుడ్ నటి..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ కూతుర్లు, కొడుకులు రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అంతే.. ఆమె తల్లి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.

నా తండ్రి ఎవరో, ఎలా ఉంటారో నాకు తెలియదు.. ఎమోషనలైన టాలీవుడ్ నటి..
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2025 | 10:27 AM

Share

సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గుర్తున్నారా.? ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆమె.. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ, మురారి, హరికృష్ణ నటించిన లాహిరిలాహిరి లాహిరిలో, మిధునం సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు లక్ష్మీ.. అలాగే ఆమె కూతురు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించింది. ఆమె ఎవరో కాదు ఐశ్వర్య భాస్కరన్.. ఐశ్వర్య కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ఇప్పుడు అమ్మ , అత్త, వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

ఒక ఇంటర్వ్యూలో  ఐశ్వర్య మాట్లాడుతూ.. తాను పెద్దయ్యాక, సుమారు 18-19 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని కలుసుకున్నానని ఐశ్వర్య తెలిపారు. చిన్నతనంలో తన తండ్రి ఎవరు.? ఎలా ఉంటారు అనే కనీస అవగాహన కూడా తనకు లేదని, కనీసం ఆయన ఫోటో కూడా తెలియదని ఆమె గుర్తు చేసుకున్నారు. తన బర్త్ సర్టిఫికేట్‌లో పేరు ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కూడా అలానే పరితపించిపోయాను అని తెలిపారు ఐశ్వర్య. అలాగే అన్ని తెలిసిన ఐశ్వర్యకు తన నాన్నగారు ఎక్కడ ఉన్నారో.? ఎవరో అనేది మాత్రం తెలియదా అని చాలా మంది అన్నారు అని ఎమోషనల్ అయ్యారు.

అయితే చాలా ఏళ్ల తర్వాత తన తండ్రి కోయంబత్తూరులో ఇన్సూరెన్స్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని తెలిసింది. ఆయన ఆఫీస్ లో పని చేస్తున్న సహోద్యోగి ఐశ్వర్య ఇంటర్వ్యూను చూసి ఐశ్వర్యను సంప్రదించారట. “మీ నాన్నగారి దగ్గరే నేను పనిచేస్తున్నాను. ఆయన చాలా మంచి వ్యక్తి. ఇది ఆయన నంబర్, మీరు ఫోన్ చేయండి. నా వల్ల తండ్రి, కూతురు కలిస్తే నేను చాలా సంతోషిస్తాను” అని ఓ లెటర్ రాశారని తెలిపింది ఐశ్వర్య. ఆ విధంగా ఐశ్వర్య తన తండ్రితో మాట్లాడి, ఆ తర్వాత ఆయనను  కలుసుకున్నా అని తెలిపింది.  తన అసలు పేరు శాంతమీన అని ఐశ్వర్య తెలిపింది. ఈ పేరు తన తండ్రి తన అక్క మీన పేరు కలిసేలా పెట్టారని, అయితే మీన తాను పుట్టకముందే ఫ్రాన్స్‌లో మరణించారని తెలిపారు. ఐశ్వర్య తల్లి లక్ష్మీ సినిమా రంగంలోకి ప్రవేశించేటప్పుడు, న్యూమరాలజీ ప్రకారం శాంతమీన అనే పేరు సినిమాకు సరిపోదని భావించి, దానిని ఐశ్వర్యగా మార్చారని ఆమె చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Aishwarya Bhaskaran

Aishwarya Bhaskaran

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి