AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది.. ఈ హాటీ ఎవరంటే

మిర్జాపూర్.. ఓటీటీ ప్లాట్ ఫామ్‏లో పూర్తిగా నెగిటివిటీ మూటకట్టుకున్న సిరీస్. దీనిని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ఇప్పుడు మూడో సీజన్ వరకు చేరింది. ఇప్పుడు మిర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఓటీటీలో అలరిస్తుంది.

సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది.. ఈ హాటీ ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2025 | 9:13 AM

Share

మీర్జాపూర్ సిరీస్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మూడు సీజన్ పూర్తి చేసుకుంది మీర్జాపూర్. త్వరలోనే సీజన్ 4 రానుంది. దానికోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 3 ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సిరీస్ ద్వారా ఇప్పటివరకు చాలా మంది సినీతారలకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న తారలకు పాపులారిటీని తీసుకువచ్చింది మీర్జాపూర్ సిరీస్. ఈక్రమంలోనే ప్రస్తుతం ఓ సినీతార గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఒక్క సిరీస్ ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇక ఇప్పుడు ఈ తారకు ఇన్ స్టా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..?

మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3లో దద్దా త్యాగి కోడలు సలోని త్యాగి పాత్రలో నటించిన నేహా సర్గమ్. ఈ సిరీస్ లో దద్దా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్యగా కనిపించింది. సలోని త్యాగి పాత్రలో నటించిన బ్యూటీ నేహా సర్గమ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. మీర్జాపూర్ 3 సిరీస్ ద్వారా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. బీహార్‌లోని పాట్నాకు చెందిన నేహా.. అసలు పేరు నేహా దూబే. పాట్నాలో చదువు పూర్తయ్యాక తల్లి, చెల్లితో కలిసి ముంబై షిఫ్ట్ అయ్యింది.

సినీ పరిశ్రమలో సింగర్ కావాలనుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాల్గొంది. కానీ అదే సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆ షో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత రాజన్ షాహి తన సీరియల్లో నేహాకు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. కానీ నేహా తల్లిదండ్రులకు ఆమె నటిగా మారడం ఇష్టం లేదు. అలాంటి పరిస్థితులలో రాజన్ షాహి స్వయంగా నేహా ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులను ఒప్పించడంతో చాంద్ చూపా బాదల్ మే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న నేహా.. 2012లో రామాయణ్: సబ్కే జీవన్ కా ఆధార్ సీరియల్ లో సీత పాత్రలో నటించింది. ఘుమ్ హై కిసీ కే ప్యార్ మే సీరియల్లో నటించిన నటుడు నీల్ భట్ కూడా రామాయణ్ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్లు రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. నేహా సర్గమ్ పౌరాణిక షోలలోనే ఎక్కువగా నటించింది. రామాయణ్, యశోమతి మైయా, పరమావతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఇప్పుడు మీర్జాపూర్ 3 ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

View this post on Instagram

A post shared by neha sargam (@nehasargam)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?