అమెరికాను అధిగమించే రోజు దగ్గర్లోనే ఉంది
కరోనా కేసులలో కేవలం నెల రోజుల్లోనే అమెరికాను దాటేసి ఇండియా మొదటి స్థానంలో ఉంటుందన్న అంచనాలు భయాందోళనను కలిగిస్తున్నాయి.
కరోనా కేసులలో కేవలం నెల రోజుల్లోనే అమెరికాను దాటేసి ఇండియా మొదటి స్థానంలో ఉంటుందన్న అంచనాలు భయాందోళనను కలిగిస్తున్నాయి.. ఇప్పటి వరకు కరోనా కేసులలో అమెరికానే అన్ని దేశాల కంటే ముందుంది.. ఆ తర్వాతి స్థానంలో భారత్ కొనసాగుతోంది.. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగుతూ పోతే మాత్రం అక్టోబర్ మొదటి వారంలో అమెరికాను భారత్ వెనక్కి నెట్టేయడం ఖాయమని హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ చెబుతోంది.. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షల సంఖ్యలో కరోనా కేసులు ఉననాయి.. మన దగ్గర ఈ సంఖ్య ఇంచుమించు 46 లక్షలు ఉంది.. అక్టోబర్ మొదటివారానికి ఈ సంఖ్య 70 లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటోంది బిట్స్ పిలానీ. ఈ విషయాన్ని ఆ విద్యా సంస్థ నోటి మాటగా చెప్పడం లేదు.. అడ్వాన్స్‌డ్ స్టాటిస్టికల్ టెర్నింగ్ టెక్నిక్స్ విధానంతో ఈ అంచనాకు వచ్చామని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ టీఎస్‌ఎల్ రాధిక అన్నారు..