భర్త విడాకులు ఇమ్మనందుకు భార్య ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త విడాకులు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేయడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఓ భార్య. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిథిలోని మైత్రీపురంలో నివాసం ఉంటున్న పగడాల కవిత(39)కు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ ప్రాంతానికి చెందిన పగడాల నవీన్‌కుమార్‌తో పదిహేను సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే, కుటుంబ కలహాల కారణంగా భార్యభర్తలిద్దరు గొడవపడి వేరువేరుగా ఉంటున్నారు. గత 10 సంవత్సరాలుగా కవిత భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది. పలుమార్లు భార్యను రమ్మని చెప్పినా, రాకపోవడంతో భర్త కోపంతో విడాకులు తీసుకోవాలని భావించి కోర్టును ఆశ్రయించాడు. భర్త కోర్టులో దావా వేయడంతో మనస్తాపానికి గురైన భార్య కవిత గురువారం ఇంట్లో ఎవరులేని సమయంలో బెడ్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కవిత తమ్ముడు నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.