దేశంలో 1 మిలియన్ దాటిన కరోనా కేసులు..గడిచిన 24 గంటల్లో 687 మంది మృతి
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు రేంజ్ లో 34,956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే టాప్.

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు రేంజ్ లో 34,956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే టాప్. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1 మిలియన్ దాటింది. కొత్తగా మరో 687 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్-19 వివరాలు :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832
దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 3,42,473
కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 6,35,757
దేశవ్యాప్తంగా మొత్తం కరోనాతో మృతి చెందినవారి సంఖ్య : 25,602
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. మహారాష్ట్రలో కరోనా వీరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,281కి చేరింది. 11,194 మంది వైరస్ వలన మరణించారు. తమిళనాడులో కోవిడ్-19 కేసులు 1,56,369గా ఉంది. 2,236 మంది వైరస్ కారణంగా బలయ్యారు. ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 1,18,645 మందికి కరోనా సోకింది. మొత్తంగా 3,545 మంది మరణించారు. గుజరాత్లో మొత్తంగా 45,481 మందికి కరోనా సోకగా.. 2,089 మంది వ్యాధి కారణంగా ప్రాణాలు విడిచారు.




