ఇండియాలో కరోనా కల్లోలం: 75,760 కేసులు, 1023 మరణాలు
ఇండియాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ప్రతిరోజూ 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది.

ఇండియాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ప్రతిరోజూ 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో రికార్డు రేంజ్‌లో 75,760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 33లక్షలు దాటింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 1023మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ఇండియాలో వెయ్యికిపైగా కోవిడ్ మరణాలు నమోదుకావడం ఇది నాలుగోసారి. ఫలితంగా దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 60,472కు చేరింది. గురువారం మరో 56వేల మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 76శాతంగా ఉండగా, డెత్ రేటు 1.8శాతంగా ఉంది.
- కొత్త కేసులు: 75,760
- కొత్త మరణాలు: 1023
- మొత్తం కేసులు: 33,10,235
- మొత్తం మరణాలు: 60472