అక్రమ లేఅవుట్లకు చెక్‌.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

అక్రమ లేఅవుట్లకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిషేధిస్తూ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అక్రమ లేఅవుట్లకు చెక్‌.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Follow us

|

Updated on: Aug 27, 2020 | 2:13 PM

అక్రమ లేఅవుట్లకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిషేధిస్తూ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాత్మక, ప్రణాళికాబద్ధమైన అభివృద్దే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి కొత్త పంచాయతీరాజ్, పురపాలక చట్టం నిబంధనలకు లోబడి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చేయాలని కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.

లేఅవుట్ అనుమతి, ఎల్ఆర్​ఎస్ ఉన్న ప్లాట్లను, క్రమబద్దీకరణ చేసుకున్న భవనాలు, నిర్మాణాలు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఆమోదించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఎక్కడైనా ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆదేశించారు. ఈ మార్గదర్శకాలు తక్షణమే అమలులోకి వస్తాయని.. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, అనధికార, అక్రమ లేఔట్ల నిరోధక చట్టం-2015 ప్రకారం అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసుకోవాలి. లేనిచో వాటిని రిజిస్ట్రేషన్ ‌శాఖ నిషేధిత ఆస్తుల లిస్టులో చేరుస్తుంది.

Also Read: 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..

తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..