
India Corona Cases : ఇండియాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజూ సగటున 60 వేల పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,489 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 25లక్షల 89 వేలు దాటింది. కొత్తగా మరో 944 మంది కరోనా వల్ల చనిపోయారు.
కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం దేశంలో కరోనా వివరాలు
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,89,682
ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 6,77,444
వ్యాధి బారి నుంచి కోలుకున్నావారు 18,62,258
కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 49,980
మరోవైపు ప్రభుత్వాలు సరైన కట్టడి చర్యలు తీసుకోవడం, ప్రజల కూడా జాగ్రత్తలు తీసుకోవడం వలన వల్ల రికవరీ రేటు పెరుగుతోంది. డెత్ రేటు క్రమంగా తగ్గుతూ.. 1.94 శాతానికి చేరుకుంది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్(ట్రిపుల్ టి) వ్యూహంతో కరోనా టెస్టుల సంఖ్య కూడా రోజురోజుకు పెంచుతున్నారు. శనివారం 7 లక్షల 46 వేలకుపైగా శాంపిల్స్ పరీక్షించారు.
Also Read :
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు