కారు కొంపముంచిన రోటీ మేకర్..!
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి గండికొట్టాడా..? సోలిపేట సుజాత ఓటమికి ఆ గుర్తు కారణమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి గండికొట్టాడా..? సోలిపేట సుజాత ఓటమికి ఆ గుర్తు కారణమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అండూరు నాగరాజుకి ఎన్నికల అధికారులు రోటీ మేకర్ గుర్తును కేటాయించారు. నాగరాజుకు మొత్తం 3,489 ఓట్లు పోలయ్యాయి. రోటీ మేకర్ చిహ్నం టిఆర్ఎస్ పార్టీ చిహ్నంతో సమానంగా కనిపిస్తున్నందున ఓటర్లు నాగరాజుకు ఓటు వేశారని టిఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 1,64,186 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోలయ్యాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకి 3,489 ఓట్లు పడ్డాయి. ఈ మూడు ప్రధాన పార్టీల తర్వాత నాగరాజు నాలుగో స్థానంలో నిలిచాడు. కారును పోలిన సింబల్‌ను నాగరాజుకు కేటాయించడంతోనే టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన ఓట్లన్ని అతనికి పడ్డాయని భావిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1,453 పోలవ్వగా, అందులో 1,381 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 60 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఎక్కువ ఓట్లు సాధించడంలో, బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ తరువాత నాగరాజు నాలుగో స్థానంలో నిలిచారు. బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు 1,118 ఓట్ల తేడాతో ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి ఎస్ సుజాతపై విజయం సాధించారు. మరో నాలుగు ఈవీఎంలను ఇంకా లెక్కించాల్సి ఉంది.