AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో టీ20: టీమిండియాలో పలు మార్పులు.. జట్టుకు దూరం కానున్న స్టార్ బౌలర్.?

IND Vs NZ 2nd T20: అనుకున్నట్లుగానే కివీస్ టూర్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇరు జట్ల బౌలర్లు తేలిపోయిన వేళ.. బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. ఫస్ట్ టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లకు 203 పరుగులు చేస్తే.. భారత్ ఆ లక్ష్యాన్ని ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఒక్కరూ.. ఇద్దరూ కాదు.. ఏకంగా […]

రెండో టీ20: టీమిండియాలో పలు మార్పులు.. జట్టుకు దూరం కానున్న స్టార్ బౌలర్.?
Ravi Kiran
|

Updated on: Jan 26, 2020 | 10:57 AM

Share

IND Vs NZ 2nd T20: అనుకున్నట్లుగానే కివీస్ టూర్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇరు జట్ల బౌలర్లు తేలిపోయిన వేళ.. బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. ఫస్ట్ టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లకు 203 పరుగులు చేస్తే.. భారత్ ఆ లక్ష్యాన్ని ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఒక్కరూ.. ఇద్దరూ కాదు.. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీలు చేశారు.

ఇప్పుడు రెండో టీ20కు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో భారత్ బరిలోకి దిగుతుంటే.. ఎలాగైనా కోహ్లీసేనపై బదులు తీర్చుకోవాలన్న కసితో కివీస్ పోరుకు సిద్ధమైంది. ఈడెన్ పార్క్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం అన్నది మొదటి మ్యాచ్‌తోనే అర్ధమైంది. దీన్ని బట్టి చూస్తే రెండో మ్యాచ్‌కు మరో పరుగుల పండగేనని చెప్పాలి. కాగా, ఈ టీ20కి భారత్ పలు మార్పులతో రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

బుమ్రాకు గాయం.. సైనీకి పిలుపు.?

ఒక్క మ్యాచ్ తర్వాత జట్టులో మార్పులు చేసి.. విజయాలకు అడ్డుకట్ట వేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు ఆలోచించడు. కానీ మొదటి టీ20లో బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో జట్టులో కీలక మార్పులు చేయాలని చూస్తున్నాడట. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ సైనీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. అలాగే మొదటి మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి బుమ్రా గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే.

దీనితో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా.. లేదా అన్నది మ్యాచ్ మొదలయ్యే ముందు ఫైనల్ చేస్తారని సమాచారం. అటు రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తన స్థాయి చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రాహుల్, కోహ్లీ, అయ్యర్ వాళ్ళ ఫామ్‌ను కొనసాగిస్తే గెలుపు లాంఛనమే అని చెప్పాలి.

Follow Us
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!
కోపం వచ్చినప్పుడు ఈ ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ జీవితమే మారుతుంది
కోపం వచ్చినప్పుడు ఈ ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ జీవితమే మారుతుంది
NEET PG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి
NEET PG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి
షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయా? వెంటనే ఈ పని చేయండి..
షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయా? వెంటనే ఈ పని చేయండి..
రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే
రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే