AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax E-filing Portal: అందుబాటులోకి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్.. మొబైల్‌యాప్‌నూ విడుదల చేయనున్న సీబీడీటీ

ఆదాయపు పన్ను శాఖ.. పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. ఈరోజు నుంచి కొత్త సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.

Income Tax E-filing Portal: అందుబాటులోకి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్.. మొబైల్‌యాప్‌నూ విడుదల చేయనున్న సీబీడీటీ
Balaraju Goud
|

Updated on: Jun 07, 2021 | 7:53 AM

Share

Income Tax E-filing Portal: ఆదాయపు పన్ను శాఖ.. పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. ఈరోజు నుంచి కొత్త సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. సరికొత్త ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనుంది. ఈ కొత్త పోర్టల్ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

మరింత సరళంగా వుండేలా కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax. gov.in) ఇవాళ ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్‌లు త్వరితంగా జారీఅయ్యేందుకు ఐటీ రిటర్న్‌లను తక్షణమే ప్రాసెస్‌చేసేవిధంగా కొత్త పోర్టల్‌ అనుసంధానమై వుంటుందని, తదుపరి మొబైల్‌యాప్‌ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, కొత్త టాక్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ జూన్‌ 18న మొదలవుతుందని సీబీడీటీ వెల్లడించింది. కొత్త పోర్టల్‌ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్‌ యాక్షన్లు ఒకే డ్యాష్‌బోర్డుపై కన్పిస్తాయని, 1,2,3 ఐటీఆర్‌లు (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) ప్రిపేర్‌చేసే సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా లభిస్తుందని, త్వరలో 3,5,6,7 ఐటీఆర్‌లు ప్రిపేర్‌చేసే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని తెలిపింది.

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఇఫైలింగ్ పోర్టల్ 2.0 ద్వారా పన్ను చెల్లింపుదారులకు పలు రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. ఏ ఏ కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో చూద్దాం..

✒ కొత్త పోర్టల్ ద్వారా వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. అలాగే రిఫండ్ కూడా వేగంగానే వస్తుంది.

✒ కొత్త ఈ-ఫైలింగ్ సైట్ ఆవిష్కరణ తర్వాత మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి వస్తుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పలు రకాల సర్వీసులు పొందొచ్చు.

✒ సరికొత్త డ్యాష్‌బోర్డు కనిపిస్తుంది. అన్ని రకాల ఇంటరాక్షన్లు మీకు డిస్‌ప్లై అవుతాయి. అప్‌లోడ్స్, పెండింగ్ ట్రాన్సాక్షన్లు వంటివి కూడా కనిపిస్తాయి.

✒ ఆఫ్‌లైన్‌లోనే కూడా ఐటీఆర్ దాఖలు చేసే ఛాన్స్ ఉంటుంది.

✒ అలాగే పన్ను చెల్లింపుదారుల సందేహాలు తీర్చుకోవచ్చు.

✒ ట్యాక్స్ పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్ ఎలా దాఖలు చేయాలో నేర్చుకోవచ్చు.

✒ ట్యుటోరియల్, చాట్ బాట్, లైవ్ ఏజెంట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. మీరు మీ సందేహాలను తీర్చుుకోవచ్చు.

✒ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి పలు రకాల పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. సులభంగానే చెల్లింపులు నిర్వహించొచ్చు.

Read Also… Huzurabad by poll: రాష్ట్ర రాజకీయాల చూపు హుజూరాబాద్‌‌ వైపు.. బరిలోకి ఈటల.. పట్టుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రయత్నం..!

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై