కాలుష్య కోరల్లో ఉత్తర భారతం.. దేవుళ్ళకూ తప్పని చిక్కులు!

ఉత్తర భారతం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ఉత్తరాది ప్రజలు బయటికి అడుగుపెట్టాలంటే తెగ భయపడిపోతున్నారు. తలుపు తెరిస్తే చాలు. దట్టంగా కమ్మేసిన కాలుష్యాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో ఆక్సిజన్ శాతం పడిపోగా.. విషవాయువులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. చాలామంది ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇక వృద్దులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. దీపావళి తర్వాత ఉత్తరాదిన ఈ పరిస్థితి దాపురించింది. కాగా… దేవుళ్లు సైతం కాలుష్యం భారిన పడుతున్నారు. దీంతో ఆందోళన చెందిన భక్తులు […]

కాలుష్య కోరల్లో ఉత్తర భారతం.. దేవుళ్ళకూ తప్పని చిక్కులు!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 06, 2019 | 4:02 PM

ఉత్తర భారతం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ఉత్తరాది ప్రజలు బయటికి అడుగుపెట్టాలంటే తెగ భయపడిపోతున్నారు. తలుపు తెరిస్తే చాలు. దట్టంగా కమ్మేసిన కాలుష్యాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో ఆక్సిజన్ శాతం పడిపోగా.. విషవాయువులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. చాలామంది ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇక వృద్దులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. దీపావళి తర్వాత ఉత్తరాదిన ఈ పరిస్థితి దాపురించింది.

కాగా… దేవుళ్లు సైతం కాలుష్యం భారిన పడుతున్నారు. దీంతో ఆందోళన చెందిన భక్తులు దేవతా విగ్రహాలకు మాస్క్ లు కట్టి.. తమ ఇష్ట దైవంపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. వారణాసిలోని కాశీ విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న శివపార్వతి ఆలయంలోని విగ్రహాలకు అక్కడి పూజారి, భక్తులు మాస్క్ లు తొడిగారు. వేసవి కాలంలో అయితే తమ ఇష్ట ధైవాలను వేసవి తాపం నుంచి రక్షించేందుకు భక్తులు చందనం పూస్తారు. శీతాకాలంలో చలి నుంచి రక్షించేందుకు స్వెటర్లు, కంబళ్లు కప్పుతారు. తాజాగా కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు ధరించి తమ దేవుళ్ల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. ఢిల్లీ, హర్యానాలోనూ వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఆందోళన చెందిన ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానంలో వాహనాలకు అనుమతి ఇచ్చింది. వీఐపీలు మినహా రూల్స్ అతిక్రమించిన సాధారణ వాహనదారులపై ఫైన్ ల మోత మోగించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu