532 కిలోల హెరాయిన్ పట్టివేత

పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలిస్తున్న 532 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2700 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంజాబ్ అట్టారి చెక్ పోస్టు వద్ద ఓ ట్రక్కులో హెరాయిన్‌ను తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాతి ఉప్పు బస్తాల్లో 52 కేజీల మిక్స్‌డ్ నార్కొటిక్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కశ్మీర్ కు చెందిన స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి, అమృత్‌సర్‌కు ఉప్పు దిగుమతి చేసే వ్యాపారి […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:14 am, Mon, 1 July 19
532 కిలోల హెరాయిన్ పట్టివేత

పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలిస్తున్న 532 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2700 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంజాబ్ అట్టారి చెక్ పోస్టు వద్ద ఓ ట్రక్కులో హెరాయిన్‌ను తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాతి ఉప్పు బస్తాల్లో 52 కేజీల మిక్స్‌డ్ నార్కొటిక్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కశ్మీర్ కు చెందిన స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి, అమృత్‌సర్‌కు ఉప్పు దిగుమతి చేసే వ్యాపారి తారిఖ్ అన్వర్‌ను అరెస్టు చేశారు.