అవినీతి న్యాయమూర్తీ.. మీకు శిక్ష తప్పదా ?

‘ కంచే చేను మేసినట్టు ‘ అవినీతిపై కొరడా ఝళిపించాల్సిన న్యాయమూర్తే అవినీతికి పాల్పడ్డాడు. న్యాయ చరిత్రకు ‘ నల్లటి మచ్ఛ ‘ పూశాడు. ఆయనే అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఎన్. శుక్లా.. ఈయనపై కేసు దాఖలు చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు. పదవిలో ఉన్న ఒక న్యాయమూర్తి (సిటింగ్ జడ్జి) పై సీబీఐ కేసు పెట్టడం ఇదే మొట్టమొదటిసారి. 2017 లో ఓ ప్రయివేటు మెడికల్ కళాశాలకు అనుకూలంగా […]

అవినీతి న్యాయమూర్తీ.. మీకు శిక్ష తప్పదా ?
Anil kumar poka

|

Jul 31, 2019 | 1:10 PM

‘ కంచే చేను మేసినట్టు ‘ అవినీతిపై కొరడా ఝళిపించాల్సిన న్యాయమూర్తే అవినీతికి పాల్పడ్డాడు. న్యాయ చరిత్రకు ‘ నల్లటి మచ్ఛ ‘ పూశాడు. ఆయనే అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఎన్. శుక్లా.. ఈయనపై కేసు దాఖలు చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు. పదవిలో ఉన్న ఒక న్యాయమూర్తి (సిటింగ్ జడ్జి) పై సీబీఐ కేసు పెట్టడం ఇదే మొట్టమొదటిసారి. 2017 లో ఓ ప్రయివేటు మెడికల్ కళాశాలకు అనుకూలంగా జస్టిస్ శుక్లా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారంలో ఆయన దోషిగా తేలారని కొందరు న్యాయమూర్తులతో కూడిన పానెల్ నిర్ధారించింది. నిజానికి భారత ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేనిదే ఒక సిటింగ్ జడ్జిమీద కేసు పెట్టేందుకు సీబీఐకి వీలు లేదు .కానీ ఇక్కడ చీఫ్ జస్టిస్ స్వయంగా ఈ దర్యాప్తు సంస్థకు అనుమతినివ్వడం విశేషం. శుక్లాను ఇన్వెస్టిగేట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరిన సీబీఐకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోగడ శుక్లాను రాజీనామా చేయవలసిందిగానో, లేదా స్వచ్చందంగా పదవి వదులుకోవలసిందిగానో మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశించినప్పటికీ.. .జస్టిస్ శుక్లా ఇందుకు నిరాకరించడంతో. గత ఏడాది ఆయనను న్యాయ సంబంధ విధుల నుంచి తప్పించారు. శుక్లాను అభిశంసించేందుకు పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ చీఫ్ జస్టిస్ గొగోయ్ ఆ మధ్య ప్రధాని మోదీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఒక ప్రయివేట్ మెడికల్ కాలేజీకి విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో డెడ్ లైన్ పొడిగించుకునేందుకు అనుకూలంగా జస్టిస్ శుక్లా ఉత్తర్వులిచ్చారట. ఈ ఆరోపణలపై విచారణకు అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కొందరు జడ్జీలతో కూడిన పానెల్ ను నియమించారు. ఆ కమిటీ జస్టిస్ శుక్లాను దోషిగా తేల్చింది. అసలు ఈ మెడికల్ కాలేజీ ‘ యవ్వారం ‘ అప్పట్లో పెను దుమారాన్ని సృష్టించింది. విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి ఈ కళాశాలకు డెడ్ లైన్ పొడిగించే విషయంలో శుక్లా తన తీర్పును తానే లిఖితపూర్వకంగా మార్చారట. అయితే ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu