అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్..?

పాకిస్తాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఒక రకంగా.. అప్పుల ఊబిలోకి పాకిస్తాన్ కురుకుపోతుందనే చెప్పాలి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి డేటా వివరాలు పంపింది. ఈ డేటా ప్రకారం.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. పాకిస్తాన్.. 8 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చింది. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఒక్క […]

అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 09, 2019 | 5:04 PM

పాకిస్తాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఒక రకంగా.. అప్పుల ఊబిలోకి పాకిస్తాన్ కురుకుపోతుందనే చెప్పాలి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి డేటా వివరాలు పంపింది. ఈ డేటా ప్రకారం.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. పాకిస్తాన్.. 8 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చింది. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఒక్క ఏడాదిలో ఈ స్థాయిలో.. అప్పులు చేయలేదు. ఎనిమిది లక్షల కోట్ల అప్పులో.. 2.8 లక్షల కోట్లు విదేశాల నుంచి తీసుకుంది పాక్ ప్రభుత్వం. మిగిలిన అప్పు స్వదేశంలోనే సేకరించింది. దీంతో.. అత్యధిక అప్పులు చేసిన దేశంగా పాకిస్తాన్ రికార్డులు నెలకొల్పింది.

కాగా.. పాకిస్తాన్ ప్రస్తుత అప్పు మొత్తం రూ.32 లక్షల 24 వేల కోట్లకు చేరింది. ఇమ్రాన్ అధికార పగ్గాలు స్వీకరించకముందు పాక్ అప్పు రూ.24 లక్షల 73 వేల కోట్లుగా ఉండేది. అంటే దాదాపుగా ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తరువాత 8 లక్షల కోట్ల భారం.. ఆ ప్రభుత్వంపై పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తొలి రెండు నెలల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు 1.43 శాతం పెరిగినట్టు తాజా గణాంకాలు చెబుతోన్నాయి.

2018 ఆగష్టు.. 2019 ఆగష్టు మధ్య కాలంలో ప్రభుత్వం విదేశాల నుంచి.. రూ.32 లక్షల 24 వేల కోట్లలకు పైగా రుణాన్ని సేకరించిందని.. పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. తమ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి.. పాకిస్తాన్.. చైనా శరణుజొచ్చింది. అటు చైనా కూడా పాక్ పట్ల ఉదారంగా వ్యవహరించడంతో కొంత వరకు ఊరట లభిస్తున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి కూడా సహాయాన్ని కోరింది. అప్పుల భారంలో కూరుకుపోయిన 8 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దేశం తన సైనిక అవసరాలకు ఎక్కువగా నిధులు కేటాయించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

అయితే.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పాకిస్తాన్ ప్రజల నుంచి పన్ను వసూలులో మాత్రం లక్ష్యానికి చేరుకుందనే చెప్పాలి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్న పాకిస్తాన్.. 96 వేల కోట్లను వసూలు చేసింది.