బంగాళాఖాతంలో అల్పపీడనం..మళ్లీ వర్షాల జోరు!
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో…వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ జోరుగా విరుచుకుపడే అవకాశముంది. 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. వచ్చే 48 గంటల్లో అల్పపీడనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని…రాయలసీమలో మూడ్రోజులు తేలికపాటి నుంచి […]

Rains In Andhra
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో…వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ జోరుగా విరుచుకుపడే అవకాశముంది. 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. వచ్చే 48 గంటల్లో అల్పపీడనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని…రాయలసీమలో మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.