AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..తెలిస్తే వెంటనే మొదలుపెడతారు!

మనమందరం చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, మచ్చలేకుండా, సహజమైన మెరుపుతో ఉండాలని కోరుకుంటాం. ఇందుకోసం మార్కెట్లో లభించే ఖరీదైన కెమికల్ ప్రాసెస్డ్ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. అయితే, ఇవి తాత్కాలిక మెరుపును మాత్రమే ఇస్తాయి తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించలేవు. పైగా వీటి వల్ల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే ఐస్ వాటర్ తో ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖం వాష్ చేసుకోవడం వల్ల కలిగే ప్రధాన లాభాలు ఇవే:

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..తెలిస్తే వెంటనే మొదలుపెడతారు!
Wash Your Face With Ice Water
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2026 | 1:50 PM

Share

ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేకుండా కేవలం ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కోవడం ద్వారా అద్భుతమైన, సహజమైన మెరుపును పొందవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని కడగడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడి తక్షణ కాంతి లభిస్తుంది. ముడతలు, మొటిమల మంటను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఇది ఒక సులభమైన ఇంటి చిట్కా. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

అదనపు జిడ్డు మాయం:

చాలామందికి ఉదయం నిద్రలేవగానే ముఖంపై విపరీతంగా నూనె చేరుతుంటుంది. ఐస్ వాటర్‌తో ముఖం కడగడం వల్ల చర్మం నుండి విడుదలయ్యే అదనపు నూనె (Sebum) అదుపులోకి వచ్చి ముఖం తాజాదనంతో మెరుస్తుంది.

ముఖపు వాపు తగ్గుతుంది:

కొంతమందికి నిద్రలేచిన తర్వాత కళ్లు, ముఖం బాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల రక్తనాళాలు సంకోచించి, ముఖంపై ఉన్న వాపు వెంటనే తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

తక్షణ మెరుపు, చర్మ సౌందర్యం:

ఐస్ వాటర్ ముఖానికి తగలగానే రక్తప్రసరణ వేగవంతమవుతుంది. దీనివల్ల చర్మ కణాలకు సరిపడా ఆక్సిజన్ అంది, చర్మానికి తక్షణ కాంతి లభిస్తుంది. అలాగే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు, సన్ టాన్ తగ్గుముఖం పడతాయి.

మొటిమలు, మంట నుంచి ఉపశమనం:

మొటిమలు ఉన్న చోట మంట, ఎర్రబడటం, దురద వంటి ఇబ్బందులు ఉంటాయి. ఐస్ వాటర్ చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి ఒత్తిడిని, మొటిమల వాపును తగ్గిస్తుంది.

వృద్ధాప్య ఛాయలు దూరం:

చల్లటి నీరు చర్మ రంధ్రాలను ముడుచుకునేలా చేస్తుంది. రోజూ ఐస్ వాటర్ ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల చర్మం బిగుతుగా మారి ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.

లాంగ్ లాస్టింగ్ మేకప్:

మేకప్ వేసుకోవడానికి ఐదు నిమిషాల ముందు ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడిగితే లేదా ఐస్ క్యూబ్‌తో రుద్దితే చర్మ రంధ్రాలు మూసుకుంటాయి. దీనివల్ల వేసుకున్న మేకప్ మెలిసిపోకుండా, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా సహజమైన ఫినిషింగ్‌తో ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us