టిక్ టాక్ తో డీల్ నాకు నచ్ఛదంతే ! డోనాల్డ్ ట్రంప్

అమెరికాలో టిక్ టాక్ సంస్థతో తమ దేశ సంస్థ  డీల్ కుదుర్చుకోవడం తనకు నచ్ఛదని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందాన్ని అంగీకరించడానికి సిధ్ధంగా లేనన్నారు.   దేశంలో టిక్ టాక్ ఆపరేషన్స్ నిర్వహించడానికి ఆ సంస్థతో డీల్ కుదుర్చుకునేందుకు..

  • Publish Date - 12:38 pm, Thu, 17 September 20 Edited By: Pardhasaradhi Peri
టిక్ టాక్ తో డీల్ నాకు నచ్ఛదంతే ! డోనాల్డ్ ట్రంప్

అమెరికాలో టిక్ టాక్ సంస్థతో తమ దేశ సంస్థ  డీల్ కుదుర్చుకోవడం తనకు నచ్ఛదని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందాన్ని అంగీకరించడానికి సిధ్ధంగా లేనన్నారు.   దేశంలో టిక్ టాక్ ఆపరేషన్స్ నిర్వహించడానికి ఆ సంస్థతో డీల్ కుదుర్చుకునేందుకు ఒరాకిల్ ముందుకు వఛ్చిన నేపథ్యంలో ట్రంప్ దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు. అయితే వీటి మధ్య డీల్ కుదరవలసి ఉందని, దాన్ని తాను చూస్తానని ఆయన చెప్పారు. అధికారులతో  త్వరలో చర్చిస్తానని ఆయన అన్నారు. దేశ భద్రతకు సంబంధించినంతవరకు టిక్ టాక్ వంద శాతం ముప్పేనని భావిస్తున్నామని, ఇదివరకటి పాటే పాడారు. యుఎస్ లో టిక్ టాక్ కార్యకలాపాలను ఏ సంస్థకైనా అమ్మడానికో లేదా మొత్తానికే ఇక్కడ మూసివేయడానికో దీని మాతృక సంస్థ బైట్ డ్యాన్స్ కి ట్రంప్ ఈ నెల 20 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే.