మోదీకి హనుమంతుడిలాంటి వాడిని చిరాగ్‌ పాశ్వన్‌

బీహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తున్న లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీకి తాను వీరాభిమానిని చెప్పుకుంటున్న చిరాగ్‌ ఆయన రాముడైతే తాను హనుమంతుడిలాంటివాడినని అంటున్నారు.. డౌటేమైనా ఉంటే గుండెను చీల్చి చూపిస్తానంటున్నారు. అంత అభిమానముంటే బీజేపీతో పొత్తుపెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అన్నది కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.. లోక్‌జనశక్తిని విమర్శిస్తూ మాట్లాడాలని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఒత్తిడి తెస్తున్నారని […]

మోదీకి హనుమంతుడిలాంటి వాడిని  చిరాగ్‌ పాశ్వన్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 12:01 PM

బీహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తున్న లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీకి తాను వీరాభిమానిని చెప్పుకుంటున్న చిరాగ్‌ ఆయన రాముడైతే తాను హనుమంతుడిలాంటివాడినని అంటున్నారు.. డౌటేమైనా ఉంటే గుండెను చీల్చి చూపిస్తానంటున్నారు. అంత అభిమానముంటే బీజేపీతో పొత్తుపెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అన్నది కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.. లోక్‌జనశక్తిని విమర్శిస్తూ మాట్లాడాలని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించిన చిరాగ్‌ బీహార్‌లో రాబోయేది బీజేపీ, ఎల్‌జేపీ ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్య చేశారు.. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ఎల్‌జేపీ వ్యతిరికస్తే మోదీ, అమిత్‌షాలను కూడా వ్యతిరేకించినట్టే అవుతుందని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ అంటున్నారు. ఓట్లను చీల్చేందుకే ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆరోపించారు సుశీల్‌ మోదీ. ఎల్‌జేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా ఇదే మాటన్నారు. ప్రజలను గందరగోళ పరిచే ఇలాంటి రాజకీయాలంటే తమకు నచ్చవని పేర్కొన్నారు. బీహార్‌లో కేవలం జేడీయూ, జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీతో మాత్రమే తమకు పొత్తు ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు చీల్చడం తప్ప ఈ ఎన్నికల్లో లోక్‌జనశక్తి పార్టీ ప్రభావం పెద్దగా ఉండదన్నారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.