డెలివరీ భాయ్.. భలే ఘరమ్ గంజాయి భాయ్.. అడ్డంగా బుక్కయినా హైదరాబాద్ యువకుడు..

ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు మత్తు పదార్థాలకు బానిసై, ఉద్యోగం పోగొట్టుకొని పుడ్ డెలివరీ భాయ్‌గా మారాడు..

  • Balaraju Goud
  • Publish Date - 5:09 pm, Fri, 20 November 20
డెలివరీ భాయ్.. భలే ఘరమ్ గంజాయి భాయ్.. అడ్డంగా బుక్కయినా హైదరాబాద్ యువకుడు..

ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు మత్తు పదార్థాలకు బానిసై, ఉద్యోగం పోగొట్టుకొని పుడ్ డెలివరీ భాయ్‌గా మారాడు.. కెనడాలో ఎం.ఎస్ పూర్తిచేసి హైదరాబాద్ ఫేస్‌బుక్‌లో ఉద్యోగం సంపాదించాడు కానీ మత్తుకు అలవాటు పడి జీవితంలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు.. చివరకు గంజాయి సప్లయ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు..
సికింద్రాబాద్ కవాడీగూడకు చెందిన బాలాజీసింగ్ ఉపాధి కోసం పుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు.ఈ క్రమంలో ధూల్‌పేటలోని కొంతమంది గంజాయి బ్యాచ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వారిచ్చిన గంజాయిని గచ్చిబౌలిలోని కొంతమంది ఐటీ ఉద్యోగులు, మాదాపూర్‌‌లో ఉంటున్న విద్యార్థులకు సరఫరా చేసేవాడు.ఈ దందాలో మత్తుతో పాటు మంచి ఇన్‌కమ్‌ రావడంతో బాలాజీ దృష్టి గంజాయి స్మగ్లింగ్‌పై పడింది. దీంతో తానే గంజాయి తీసుకొచ్చి బిజినెస్ చేయాలనుకున్నాడు.నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లి ఒకరకమైన మత్తు ద్రావణంతో పాటు గంజాయిని తీసుకొచ్చాడు. వాటిని ప్యాకెట్లలో నింపి అవసరమైన వారికి సరఫరా చేయడం మొదలెట్టాడు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో తనిఖీలు చేపట్టి బాలాజీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి దగ్గరి నుంచి 800 గ్రాముల మత్తు ద్రావణంతో పాటు, కిలో గంజాయి, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు..