నాగోట్రా ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష… ముంబై తరహా దాడిని ఆర్మీ తిప్పికొట్టిందని ప్రశంస
కశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నమయ్యింది. ఈనెల 26వ తేదీన కశ్మీర్‌లో ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర చేశారు. అయితే ఎంతో అప్రమత్తంగా వ్యవహరించిన భద్రతా బలగాలు ఈ కుట్రను భగ్నం చేశాయి.
Nagrota Encounter : కశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నమయ్యింది. ఈనెల 26వ తేదీన కశ్మీర్‌లో ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర చేశారు. అయితే ఎంతో అప్రమత్తంగా వ్యవహరించిన భద్రతా బలగాలు ఈ కుట్రను భగ్నం చేశాయి. నాగోట్రా ఎన్‌కౌంటర్‌లో నలుగురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ముంబై దాడులకు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అదేస్థాయిలో మరోసారి దాడులకు జైషే ఉగ్రవాదులు ప్లాన్ చేశారు.
జమ్ముకశ్మీర్ లోని నాగోట్రా ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్గత భద్రతపై జరిగిన సమీక్షకు హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు జాతీయభద్రతా సలహాదారు అజిత్‌దోవల్ కూడా హాజరయ్యారు. జమ్ము-శ్రీనగర్ హైవేపై నాగోట్రాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని ప్రధాని మోదీ ప్రశంసించారు . ముంబై తరహా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఆర్మీ తిప్పికొట్టిందని ప్రధాని ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడానికి టెర్రరిస్టుల పన్నిన కుట్రను భగ్నం చేసిన జవాన్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో చొరబాట్లను ఎప్పటికప్పడు భారత సైన్యం తిప్పికొడుతోంది. నాగోట్రాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారీ ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.