ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావో లేదో తేల్చుకో, రవిశాస్త్రికి హర్భజన్‌ ప్రశ్న!

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించి మాట నిలబెట్టుకుంటావో, ఫైనల్‌ ఎలెవన్‌లో చోటివ్వక మాట తప్పుతావో చెప్పాల్సిందిగా రవిశాస్త్రిని అడిగారు వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌..

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావో లేదో తేల్చుకో, రవిశాస్త్రికి హర్భజన్‌ ప్రశ్న!
Follow us
Balu

|

Updated on: Nov 20, 2020 | 5:16 PM

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించి మాట నిలబెట్టుకుంటావో, ఫైనల్‌ ఎలెవన్‌లో చోటివ్వక మాట తప్పుతావో చెప్పాల్సిందిగా రవిశాస్త్రిని అడిగారు వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌.. 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు కుల్‌దీప్‌ యాదవ్‌. సిడ్నీలో జరిగిన ఆ టెస్ట్‌లో కుల్‌దీప్‌ అయిదు వికెట్లు తీసుకున్నాడు.. అప్పుడు కుల్‌దీప్‌ ప్రదర్శనకు ఇంప్రెస్‌ అయిన రవిశాస్త్రి.. విదేశాల్లో టెస్ట్‌లు ఆడితే కుల్‌దీప్‌ యాదవ్‌ను తప్పకుండా తీసుకుంటామని అన్నాడు.. కానీ ఆసీస్‌తో జరిగే తొలి టెస్ట్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ ఆడే అవకాశాలు అసలుకే లేవంటున్నాడు హర్భజన్‌సింగ్‌.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌కు బదులుగా ఈ చైనామన్‌ స్పిన్నర్‌ను తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నాడు. లాస్టియర్ జరిగిన వన్డే ప్రపంచకప్‌ పోటీల తర్వాత కుల్‌దీప్‌ సరైన క్రికెట్‌ ఆడనేలేదన్నాడు హర్భజన్‌.. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లోనూ సరైన అవకాశాలు రాలేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులలో కుల్‌దీప్‌ను మొదటి టెస్ట్‌కు ఎంపిక చేయడం, చేయకపోవడం అన్నది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ డిసైడ్‌ చేస్తుందని హర్భజన్‌ వ్యాఖ్యానించాడు. అతడు చివరిసారిగా టెస్ట్‌ ఆడింది ఆస్ట్రేలియాలోనేనని, విదేశీ పిచ్‌లపై తమ మొదటి ప్రాధాన్యం కుల్‌దీప్‌కేనని అప్పుడు రవిశాస్త్రి మాట ఇచ్చారని, ఇప్పడతడు మాట మీద నిలబడతాడో లేదో చూడాలని అన్నాడు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!