AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శంషాబాద్‌లో కలకలం.. టేకాఫ్ సమయంలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం..!

శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. విమాన సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాణికుడి మానసిక స్థితి, మద్యం మత్తుపై దర్యాప్తు చేస్తున్నారు. విమాన భద్రతకు ముప్పు కలిగించే ఈ చర్యను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

శంషాబాద్‌లో కలకలం.. టేకాఫ్ సమయంలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం..!
Hyderabad Airport,
Balaraju Goud
|

Updated on: Oct 02, 2026 | 7:52 AM

Share

హైదరాబాద్ః శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్వాకం కలకలం రేపింది. శంషాబాద్ నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వైపు వెళ్లి దాన్ని తెరిచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పరిస్థితిని గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రయాణికుడిని సిబ్బంది అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఎందుకు తెరిచేందుకు ప్రయత్నించాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఈ చర్యకు పాల్పడ్డాడా? లేదా మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుడి వైద్య పరీక్షలు, ఇతర వివరాల ఆధారంగా ఘటనకు గల కారణాలను నిర్ధారించనున్నారు. టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడం విమాన భద్రతకు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉండటంతో అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us