AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డుల్లో వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఒకే క్లిక్‌తో అప్డేట్.. ఈ యాప్ ఉంటే చాలు..

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అందించిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో మీ వివరాలు తప్పుగా ప్రింట్ అయ్యాయా.. అయితే మీరు సులువుగా మార్చుకోవచ్చు. జస్ట్ మీ ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక యాప్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ఎలా మార్చుకోవాలంటే..?

Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డుల్లో వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఒకే క్లిక్‌తో అప్డేట్.. ఈ యాప్ ఉంటే చాలు..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Oct 01, 2026 | 9:18 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్దిదారులందరికీ ఈ కార్డులను ఉచితంగా అందించారు. ఇప్పటికే లబ్దిదారులందరికీ ఈ కార్డులు అందాయి. దాదాపు 90 శాతం మందికి ఇప్పటివరకు కార్డులను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో అనేక ఫీచర్లు ఉండగా.. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ కార్డుల్లో అనేక వివరాలు తప్పుగా ముద్రించారు. లబ్దిదారుల పేర్లు, అడ్రస్, గ్రామం వంటి వివరాలు తప్పుగా ప్రింట్ అయ్యాయి. దీంతో లబ్దిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని ఎలా మార్చుకోవాలనే తెలియక గాబారా పడుతున్నారు. కానీ మొబైల్‌లోనే సులువుగా సరైన వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలా అనేది చూద్దాం.

తప్పులు సరిదిద్దుకోవడం ఎలా..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి టీ రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

-అనంతరం మీ ఆధార్ కార్డు నెంబర్‌ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి

-ఆధార్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి

-ఓటీపీ నమోదు చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది

-మీ రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు అన్నీ అక్కడ స్క్రీన్‌పై కనిపిస్తాయి

-ఆ తర్వాత స్కాన్ స్మార్ట్ ఆర్‌/సీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-టీ రేషన్ యాప్ సాయంతో మీ స్మార్ట్ రేషన్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి

-అనంతరం సరైన వివరాలతో మీ రేషన్ కార్డు సమగ్ర డిటైల్స్ కనిపిస్తాయి

-ఆ రేషన్ కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.

కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు..

చాలామందికి తెలియక స్మార్ట్ కార్డుల్లోని తప్పులను మార్చుకునేందుకు ఎమ్మార్వో కార్యాలయాలు, రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. టీ రేషన్ యాప్ ద్వారా సులువుగా సరైన వివరాలు కలిగిన రేషన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 2014లో జరిగిన ఎస్‌కేఎస్ సర్వే ఆధారంగా ప్రజల వివరాలను సేకరించి స్మార్ట్ కార్డులపై ప్రింట్ చేశారు. దీని వల్ల కార్డుల్లో వివరాలు తప్పుగా ప్రింట్ అయ్యాయి. ఈక ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ కార్డుకి సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి. అలాగే ముందువైపుఅల్ట్రావాయొలెట్ లైట్‌లో మాత్రమే కనిపించే తెలంగాణ ప్రభుత్వ ఎంబ్లెమ్ ఏర్పాటు చేశారు.

Follow Us