AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

609 కిలోమీటర్ల రేంజ్‌ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ.. 22 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ లో నిజమెంత?

రేంజ్ రోవర్ స్పోర్ట్ పేరుకు ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్ జతైంది. JLR తొలిసారిగా స్పోర్ట్ లైనప్‌లో ఎలక్ట్రిక్ SUVని తీసుకొచ్చింది. 118.5kWh బ్యాటరీ, 609 కిలోమీటర్ల రేంజ్‌తో వచ్చిన ఈ మోడల్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 550 hp పవర్, 850 Nm టార్క్‌తో పనితీరులోనూ బలమైన ముద్ర వేయాలని కంపెనీ భావిస్తోంది. లగ్జరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ కూడా ఇందులో మరో ప్రధాన ఆకర్షణగా మార్కెట్లో నిలుస్తోంది.

609 కిలోమీటర్ల రేంజ్‌ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ.. 22 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ లో నిజమెంత?
Range Rover Sport Electric.jpg
Nikhil
|

Updated on: Oct 02, 2026 | 7:28 AM

Share

లగ్జరీ SUVల విభాగంలో రేంజ్ రోవర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే కుటుంబంలో తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్ మోడల్ వచ్చింది. వేగంగా ఛార్జింగ్, రెండు మోటార్లు, ఆల్-వీల్ డ్రైవ్‌తో పాటు ప్రీమియం క్యాబిన్ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 609 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు అవకాశం ఉంది. రూ. 2.5 కోట్ల ధర అంచనాతో ఇది రానుంది.

కొత్త ఎలక్ట్రిక్ SUV..

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్‌లో 118.5kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఒక్క ఛార్జ్‌తో 609 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. రెండు మోటార్లతో కూడిన ఆల్-వీల్ డ్రైవ్(AWD) వ్యవస్థ ఇందులో ఉంది. 550 hp పవర్, 850 Nm టార్క్‌ను అందిస్తుంది. ICE వెర్షన్‌లోని V8 ఇంజన్ మోడల్‌కు దీటుగా పనితీరు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఈ SUVను 00-వోల్ట్ ఫ్లెక్సిబుల్ మాడ్యులర్ లాంగిట్యూడినల్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. బ్యాటరీకి 8 ఏళ్ల లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో అందుకుంటుంది. 350kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంటుంది. 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ కేవలం 22 నిమిషాల్లో పూర్తవుతుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 220 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది.

లగ్జరీ క్యాబిన్..

డిజైన్ పరంగా ఎలక్ట్రిక్ మోడల్ ICE వెర్షన్‌కు దగ్గరగా ఉంటుంది. క్యాబిన్‌లో 3-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ ఉన్నాయి. 13.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, 13.7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే లభిస్తాయి. హీటెడ్, వెంటిలేటెడ్ పవర్డ్ సీట్లు, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ సన్‌బ్లైండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ SUV కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసే అవకాశం ఉంది. భారత మార్కెట్లో దీని ధర సుమారుగా రూ. 2.5 కోట్లు ఉండొచ్చని అంచనా. అధికారిక ధర, పూర్తి వేరియంట్ వివరాలు విడుదల సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Follow Us