AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ స్పోర్ట్స్ బైక్‌పై యమహా ప్లాన్ ఏంటి

యమహా R15 సిరీస్‌కు దేశంలో మంచి గుర్తింపు ఉంది. స్పోర్ట్స్ బైక్ కొనాలని చూసేవారిలో ఈ మోడళ్లకు ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. అయితే ఈ లైనప్‌లో త్వరలో కీలక మార్పు జరిగే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా R2 వచ్చిన నేపథ్యంలో R15Mను సేల్స్ నుంచి తప్పించే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ స్పోర్ట్స్ బైక్‌పై  యమహా ప్లాన్ ఏంటి
Yamaha R15m.jpg
Nikhil
|

Updated on: Oct 02, 2026 | 7:27 AM

Share

R15 V4, R15M, R2 మోడళ్లతో యమహా స్పోర్ట్స్ బైక్ విభాగంలో పలు ధరల స్థాయిలను కవర్ చేస్తోంది. ఇప్పుడు R2 రాకతో ఈ లైనప్‌ను తిరిగి సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా R15Mకు గుడ్‌బై చెప్పే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే R15, R2 సిరీస్‌ల మధ్య ధరలో గ్యాప్ మరింత పెరగనుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం అంచనాగానే ఉంది.

R15Mను తప్పించే ఆలోచన?

R15Mలోనూ 155 సీసీ ఇంజిన్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే R15 V4తో పోలిస్తే ఇందులో అదనపు ఫీచర్లు, ప్రీమియం ఫినిషింగ్ అందించారు. కొత్త R2 మార్కెట్లోకి రావడంతో R15M, R2 మధ్య ఉన్న ధర, ఫీచర్ల తేడాను కంపెనీ మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ఈ మోడల్‌ను డిస్కంటిన్యూ చేస్తే R15 V4ను తక్కువ ధరలో స్పోర్టీ బైక్ కోరుకునేవారికి అందుబాటులో ఉంచి, ఎక్కువ పెర్ఫార్మెన్స్, ప్రీమియం ఫీచర్లు కోరుకునేవారిని R2 వైపు తీసుకెళ్లే విధంగా లైనప్‌ను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే యమహా నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

ధర పెరగనుందా?

ప్రస్తుతం మార్కెట్లో R15S ధర రూ.1.59 లక్షలు. R15 V4 ధర రూ.1.75 లక్షల నుంచి రూ.1.79 లక్షలు. R15M ధర రూ.1.90 లక్షల నుంచి రూ.2.00 లక్షలు. కొత్తగా వచ్చిన R2 ధర రూ.2.30 లక్షల నుంచి రూ.2.40 లక్షలు. R2M ధర రూ.2.53 లక్షలుగా ఉంది.

R15Mను సేల్స్ నుంచి తొలగిస్తే R15 సిరీస్‌కి, R2 సిరీస్‌కి మధ్య ధర వ్యత్యాసం ప్రస్తుత రూ.30 వేల నుంచి సుమారు రూ.51 వేలకు పెరగొచ్చు. మరోవైపు ఆగస్టులో R15 సిరీస్ బైక్స్ మొత్తం 7,691 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యల్ప నెలవారీ అమ్మకాలుగా సమాచారం. దీంతో యమహా తన స్పోర్ట్స్ బైక్ లైనప్‌ను రీ-పొజిషన్ చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

Follow Us