తిమింగిలం మింగేసింది…….అయినా బతికి బయట పడ్డాడు….అమెరికాలో అరుదైన ఘటన !
చిన్న పిల్లల మూవీ,, 'పినోచిఖో' లో జరిగినట్టే జరిగింది ఈ ఘటన.. ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన అద్భుతమిది ! అమెరికా..
చిన్న పిల్లల మూవీ,, ‘పినోచిఖో’ లో జరిగినట్టే జరిగింది ఈ ఘటన.. ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన అద్భుతమిది ! అమెరికా..మసాచ్యూసెట్స్ లోని కేప్ కాడ్ సముద్ర తీరంలోనను,, సముద్రంలోనూ పీతలు, రొయ్యలను పట్టుకుని జీవించే మైఖేల్ ప్యాకర్డ్ మంచి డైవర్ కూడా.. సముద్రంలో ఎన్నో అడుగుల నీటిలో వీటికోసం ‘వేటాడుతుంటాడు’. 56 ఏళ్ళ ఈ మత్య్సకారుడు ఎప్పటిలాగే సముద్రంలో సుమారు 45 అడుగుల లోతున ఉండగా ఓ నల్ల తిమింగలం అమాంతం అతడ్ని మింగేసింది. అంతే.. ఏం జరిగిందో కూడా ఊహించలేకపోయాడు. కానీ మైఖేల్ అదృష్టం బాగుంది. హంప్ బ్యాక్ అనే జాతికి చెందిన తిమింగలం మళ్ళీ పైకి వచ్చి ఇతడ్ని బయటకి కక్కేసింది. వెంటనే ఇది చూసిన తోటి మత్స్య కారులు అతడ్ని రక్షించి తమ బోటులోకి చేర్చారు. అతడ్ని తక్షణం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కేప్ కాడ్ టైమ్స్ అనే స్థానిక పత్రికతో మాట్లాడిన మైఖేల్.. తాను తిమింగలం నోట్లో సుమారు 30 సెకండ్లు ఉన్నానని, ఆ సమయంలో తనకు తన పిల్లలు గుర్తుకు వచ్చారని చెప్పాడు. ఇక నా పని అయిపొయింది. చచ్చినట్టే అనుకున్నానన్నాడు. కానీ శ్వాస తీసుకునే ఆపరేటస్ ఉన్నందున దాని నోట్లో కూడా ఊపిరి తీసుకోగలిగానని చెప్పాడు. దానికి పళ్ళు లేకపోవడం మంచిదైందని..ఉంటే తనను నమిలేసి ఉండేదని చెప్పాడు. మొత్తానికి కాళ్లకు చిన్నపాటి గాయాలయియ్యాయన్నాడు.
ఇది ఒకవిధంగా వేల్ తో జరిగిన ఎన్ కౌంటరే అని మైఖేల్ పేర్కొన్నాడు. కాగా సాధారణంగా హంప్ బ్యాక్ తిమింగలాలలు క్రూరంగా ఉండవని, పెద్ద నోరు ఉన్నా..గొంతు భాగాలు చిన్నవిగా ఉన్న కారణంగా మనుషులను మింగజాలవని సముద్ర నిపుణులు చెబుతున్నారు. చేపలను మింగడానికి వచ్చినప్పుడు ఈ తిమింగలం బహుశా ఇతడిని మింగి ఉండవచ్చునని వారు చెప్పారు. ఏమైనా….. ఇది విచిత్రమైన సంఘటన అని పేర్కొన్నారు. తిమింగలం నోటి నుంచి బయటపడిన మైఖేల్ ప్యాకర్డ్ ని అతని కుటుంబంతో సహా అందరూ ఓ ‘హీరో’గా చూస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: TVS Sport: కేవలం రూ.1555 ఉంటే చాలు.. టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ సొంతం.. లీటరుకు 110 కి.మీ మైలేజ్